భారత ఐటీ పరిశ్రమకు ఏఐతో ముప్పేమీ లేదు
ABN , Publish Date - Apr 27 , 2026 | 02:06 AM
భారత టెక్నాలజీ పరిశ్రమ (ఐటీ)కు కృత్రిమ మేధ (ఏఐ)తో పెద్దగా ముప్పు ఉండదని ఐటీ పరిశ్రమ సమాఖ్య నాస్కామ్ కొత్త చైర్మన్ శ్రీకాంత్ వెలమకన్ని వెల్లడించారు. టెక్ పరిశ్రమను...
రూ.28 లక్షల కోట్ల ఆదాయం
నియామకాలు కొనసాగుతాయ్
నాస్కామ్ చైర్మన్ శ్రీకాంత్
న్యూఢిల్లీ: భారత టెక్నాలజీ పరిశ్రమ (ఐటీ)కు కృత్రిమ మేధ (ఏఐ)తో పెద్దగా ముప్పు ఉండదని ఐటీ పరిశ్రమ సమాఖ్య నాస్కామ్ కొత్త చైర్మన్ శ్రీకాంత్ వెలమకన్ని వెల్లడించారు. టెక్ పరిశ్రమను మరింత వృద్ధి పథంలోకి తీసుకువెళ్లేందుకు ఏఐ ఒక చోదకశక్తిగా ఉండనుందన్నారు. అంతేకాకుండా వృద్ధిపై దృష్టి పెట్టడంతో పాటు ప్రస్తుత టెక్నాలజీలకు తగ్గట్టుగా నియామకాలను చేపట్టడం ద్వారా పరిశ్రమ ముందున్న ఆటంకాలను తొలగించుకోవచ్చని అన్నారు. ప్రస్తుతం భారత ఐటీ పరిశ్రమ రెండు సవాళ్లను ఎదుర్కొంటోందని అందులో ఒకటి అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితులు కాగా మరొకటి ఏఐతో తలెత్తిన అవాంతరాలు అని ఆయన పేర్కొన్నారు. టెక్ పరిశ్రమను మరింత వృద్ధి పథంలోకి తీసుకు వెళ్లేందుకు ఏఐ ఎంతగానో తోడ్పనుందని, దీంతో పరిశ్రమకు వచ్చిన భయం ఏమీ లేదన్నారు. దేశీయంగా ఐటీ పరిశ్రమకు మంచి భవిష్యత్ ఉందని, ఏఐని అర్ధం చేసుకుని ముందుకు సాగటంతో పాటు నైపుణ్యపరంగా పనితీరును మెరుగుపరుచుకోవచ్చని తెలిపారు.
నియామకాల్లో ట్రెండ్స్ మారాయి..
కృత్రిమ మేధతో ఐటీ పరిశ్రమలో నియామక విధానాల్లో కొంత మేరకు మార్పులు వచ్చాయని శ్రీకాంత్ అన్నారు. డిమాండ్‌కు తగ్గట్టుగా టాలెంట్ ఉంటే హైరింగ్ యధావిధిగా కొనసాగుతుందని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం నియామక పద్దతుల్లో మార్పులు వచ్చాయని, కంపెనీల్లో సంస్థాగత సర్దుబాట్లు పూర్తయిన తర్వాత నియామకాలు ఊపందుకునే అవకాశం ఉందన్నారు. గత ఆర్థిక సంవత్సరంలో టీసీఎస్ సహా పలు కంపెనీలు ఫ్రెషర్స్ నియామకాలను కుదించిన సంగతి తెలిసిందే. ప్రతి వ్యాపారంలో కాలానికి తగ్గట్టుగా మార్పులు చేర్పులు ఉంటాయని, ఐటీ పరిశ్రమ ఇందుకు మినహాయింపు కాదని ఆయన అన్నారు. ఐటీ పరిశ్రమలో మల్టీ ట్రిలియన్ డాలర్ అవకాశాలున్నాయని, ప్రస్తుత పరిస్థితులన్నీ గాడిన పడిన తర్వాత ఈ రంగం మరింత వృద్ధి పథంలోకి ఖాయమని శ్రీకాంత్ అన్నారు.
భారత ఐటీ పరిశ్రమ 2025-26 ఆర్థిక సంవత్సరంలో 30,000 కోట్ల డాలర్ల (సుమారు రూ.28 లక్షల కోట్లు) ఆదాయాలను నమోదు చేసే అవకాశం ఉందని నాస్కామ్ అంచనా వేస్తోంది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో పరిశ్రమ ఆదాయం 28,200 కోట్ల డాలర్లుగా ఉంది. అంతర్జాతీయంగా నెలకొన్న అనిశ్చిత పరిస్థితులతో అనుకున్న స్థాయిలో పరిశ్రమ వృద్ధి సాధించలేకపోయిందని శ్రీకాంత్ అన్నారు.
ఇన్వెస్కో మ్యూచువల్ ఫండ్.. బీఎ్‌సఈ సెన్సెక్స్ ఇండెక్స్ ఫండ్, నిఫ్టీ బ్యాంక్ ఇండెక్స్ ఫండ్‌ను ప్రారంభించింది. ఇవి ఓపెన్ ఎండెడ్ పథకాలు. ఈక్విటీ, బ్యాంకింగ్ రంగాల్లో పెట్టుబడులు పెట్టాలనుకునే మదుపరుల కోసం వీటిని ప్రత్యేకంగా రూపొందించింది. ఈ ఫండ్ కనీస పెట్టుబడి రూ.100. సిప్ రూపంలో అయితే రోజుకు రూ.20, నెలకు రూ.100 ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. ముగింపు తేదీ మే 7.
ఎల్ అండ్ టీ ఫైనాన్స్.. మార్చితో ముగిసిన త్రైమాసికానికి కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన రూ.807 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంతో పోల్చితే లాభం 27 శాతం వృద్ధి చెందింది. మొత్తం ఆర్థిక సంవత్సరాని (2025-26)కి లాభం రూ.3,003 కోట్లుగా ఉంది.
ఆసుస్.. మార్కెట్లోకి ఎక్స్‌పర్ట్‌బుక్ అలా్ట్ర విడుదల చేసింది. కో పైలెట్, పీసీ డిజైన్, కటింగ్ ఎడ్జ్ ఏఐ ఆధారిత నైపుణ్యం, వివిడ్ డిస్‌ప్లే ఈ బుక్ ప్రత్యేకతలు. దీని ధర రూ.2.39,990.
ఇసుజు మోటార్స్ ఇండియా ఒంగోలులో సరికొత్త 3ఎస్ (సేల్స్, సర్వీస్, స్పేర్స్) డీలర్‌షిప్‌ను ప్రారంభించింది. ఈ షోరూమ్‌తో రాష్ట్రంలో మొత్తం స్టోర్ల సంఖ్య 9కి చేరుకోగా దేశవ్యాప్తంగా 108కి చేరుకున్నాయని తెలిపింది.
ఇవి కూడా చదవండి..
ఇరాన్ నాయకుల మధ్య విభేదాలు.. లీక్ అయిన రహస్య లేఖలో ఏముంది..
నా ఇంట్లోనే నన్ను గుండాతో కొట్టించారు.. కేజ్రీవాల్‌పై ఎంపీ స్వాతి సంచలన ఆరోపణలు..