Share News

భారత్‌ వృద్ధి 6.6 శాతమే: ఏడీబీ

ABN , Publish Date - Jul 10 , 2026 | 02:16 AM

ప్రస్తుత ఆర్థిక సంవత్సరాని (2026 -27)కి సంబంధించి భారత్‌ జీడీపీ వృద్ధి అంచనాను ఆసియా అభివృద్ధి బ్యాంక్‌ (ఏడీబీ) తగ్గించింది...

భారత్‌ వృద్ధి 6.6 శాతమే: ఏడీబీ

ముంబై: ప్రస్తుత ఆర్థిక సంవత్సరాని (2026 -27)కి సంబంధించి భారత్‌ జీడీపీ వృద్ధి అంచనాను ఆసియా అభివృద్ధి బ్యాంక్‌ (ఏడీబీ) తగ్గించింది. ఇంతకు ముందు భారత్‌ 6.9 శాతం వృద్ధిని నమోదు చేస్తుందని అంచనా వేయగా ఇప్పుడు దీన్ని 6.6 శాతానికి సవరించింది. పశ్చిమాసియా సంక్షోభంతో ఇంధన ధరలు పెరగటమే ఇందుకు కారణమని తెలిపింది. కాగా వచ్చే ఆర్థిక సంవత్సరాని (2027-28)కి గాను 7.3 శాతం వృద్ధి అంచనాను కొనసాగిస్తున్నట్టు ఏడీబీ పేర్కొంది.

ఈ వార్తలనూ చదవండి:

రోజంతా నిలకడగా రాణించి, చివరికి లాభాల్లోనే ముగిసిన సూచీలు

స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. ప్రస్తుతం ఎలా ఉన్నాయంటే..

Updated Date - Jul 10 , 2026 | 02:16 AM