Share News

విమానాశ్రయాలపై రూ.లక్ష కోట్ల పెట్టుబడులు

ABN , Publish Date - Jun 24 , 2026 | 04:14 AM

అదానీ గ్రూప్‌ తన వ్యాపార సామ్రాజ్యాన్ని మరింత విస్తరిస్తోంది. ఇందులో భాగంగా వచ్చే ఐదేళ్లలో విమానాశ్రయ ప్రాజెక్టులపై రూ.90,000 కోట్ల నుంచి...

విమానాశ్రయాలపై రూ.లక్ష కోట్ల పెట్టుబడులు

ముంబై: అదానీ గ్రూప్‌ తన వ్యాపార సామ్రాజ్యాన్ని మరింత విస్తరిస్తోంది. ఇందులో భాగంగా వచ్చే ఐదేళ్లలో విమానాశ్రయ ప్రాజెక్టులపై రూ.90,000 కోట్ల నుంచి రూ.లక్ష కోట్ల వరకు పెట్టుబడి పెట్టబోతున్నట్టు అదానీ ఎయిర్‌పోర్ట్‌ హోల్డింగ్స్‌ కంపెనీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ జీత్‌ అదానీ చెప్పారు. గుజరాత్‌లోని ముంద్రా ఎయిర్‌పోర్టు నుంచి వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభమైన సందర్భంగా ఆయన ఈ విషయం వెల్లడించారు. ప్రభుత్వం ప్రైవేటీకరించాలని యోచిస్తున్న 11 విమానాశ్రయాల కోసం తమ గ్రూప్‌ తప్పకుండా పోటీపడుతుందన్నారు.అయితే ఇందులో ఎన్ని విమానాశ్రయాలు తమకు వస్తాయనే విషయం చెప్పలేనని జీత్‌ అదానీ తెలిపారు.

ఇవి కూడా చదవండి

వర్షంలో కారు నడుపుతున్నారా? ఈ ట్రిక్ ఫాలో అవ్వండి

తమిళనాడు సీఎం విజయ్‌పై ఉదయనిధి వ్యక్తిగత విమర్శలు!

Updated Date - Jun 24 , 2026 | 04:14 AM