Share News

’అదానీ ఎయిర్‌పోర్ట్‌ రూ.2,790 కోట్ల సమీకరణ

ABN , Publish Date - Nov 24 , 2026 | 04:09 AM

అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ లిమిటెడ్‌కు చెందిన విమానాశ్రయా ల నిర్వహణ సంస్థ అదానీ ఎయిర్‌పోర్ట్‌ హోల్డింగ్స్‌ లిమిటెడ్‌ (ఏఏహెచ్‌ఎల్‌) మరో 30 కోట్ల డాలర్లు (దాదాపు రూ.2,790 కోట్లు) సమీకరించేందుకు..

’అదానీ ఎయిర్‌పోర్ట్‌ రూ.2,790 కోట్ల సమీకరణ

న్యూఢిల్లీ: అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ లిమిటెడ్‌కు చెందిన విమానాశ్రయా ల నిర్వహణ సంస్థ అదానీ ఎయిర్‌పోర్ట్‌ హోల్డింగ్స్‌ లిమిటెడ్‌ (ఏఏహెచ్‌ఎల్‌) మరో 30 కోట్ల డాలర్లు (దాదాపు రూ.2,790 కోట్లు) సమీకరించేందుకు 360 వన్‌ అసెట్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. దీంతో సంస్థ చేపట్టిన మొత్తం ఈక్విటీ నిధుల సమీకరణ దాదాపు 135 కోట్ల డాలర్లకు చేరనుంది. ఇంతకుముందు అల్ఫా వేవ్‌ గ్లోబల్‌, ప్రేమ్‌జీ ఇన్వెస్ట్‌, టెమాసెక్‌, బ్లాక్‌రాక్‌ నిర్వహిస్తున్న ఫండ్స్‌తో కూడిన కన్సార్షియం నుంచి 100 కోట్ల డాలర్ల సమీకరించింది.

Updated Date - Nov 24 , 2026 | 04:10 AM