Share News

హైదరాబాద్‌లో యాక్సెంచర్‌ విస్తరణ

ABN , Publish Date - Jun 24 , 2026 | 04:57 AM

ఐటీ సేవల సంస్థ యాక్సెంచర్‌.. హైదరాబాద్‌లో తన కార్యాలయాలను మరింతగా విస్తరిస్తోంది. కొండాపూర్‌లోని అపర్ణ టెక్నోపోలిస్‌ ఐటీ హబ్‌లో యాక్సెంచర్‌ 10,16,912 చదరపు అడుగుల...

హైదరాబాద్‌లో యాక్సెంచర్‌ విస్తరణ

కొత్తగా లీజుకు 10 లక్షల ఎస్‌ఎ్‌ఫటీ కార్యాలయ స్థలం

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): ఐటీ సేవల సంస్థ యాక్సెంచర్‌.. హైదరాబాద్‌లో తన కార్యాలయాలను మరింతగా విస్తరిస్తోంది. కొండాపూర్‌లోని అపర్ణ టెక్నోపోలిస్‌ ఐటీ హబ్‌లో యాక్సెంచర్‌ 10,16,912 చదరపు అడుగుల (ఎస్‌ఎ్‌ఫటీ) కార్యాలయ స్థలాన్ని 10 ఏళ్ల కాలానికి లీజుకు తీసుకుంది. ఇందుకోసం వచ్చే పదేళ్లలో యాక్సెంచర్‌.. అపర్ణ టెక్నోపోలి్‌సకు లీజు కింద దాదాపు రూ.1,000 కోట్లు చెల్లించనుంది. ప్రతి ఏటా అద్దె 4.25 శాతం పెంచే షరతుపై యాక్సెంచర్‌ కంపెనీ ఈ ఆఫీసు స్పేస్‌ను లీజుకు తీసుకుంది. ఇటీవల ఇదే ప్రాజెక్టులో టెక్‌ మహీంద్రా కూడా పదేళ్ల కాలానికి 3.97 లక్షల ఎస్‌ఎ్‌ఫటీ ఆఫీస్‌ స్పేస్‌ను రూ.410.93 కోట్లకు లీజుకు తీసుకుంది.

రెండు దశల్లో..

యాక్సెంచర్‌ రెండు విడతలుగా ఈ 10.16 లక్షల చదరపు అడుగుల ఆఫీస్‌ స్పేస్‌ను లీజుకు తీసుకోనుంది. ఇందులో మొదటి దశ ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచే అమల్లోకి వచ్చింది. రెండో దశ ఈ ఏడాది సెప్టెంబరు నుంచి అందుబాటులోకి వస్తుంది. తొలి దశ ఆఫీస్‌ స్పేస్‌ లీజు చెల్లింపు ఈ ఏడాది డిసెంబరు నుంచి, రెండో దశ లీజు చెల్లింపులు వచ్చే ఏడాది ఫిబ్రవరి 1 నుంచి ప్రారంభమవుతాయి.

ఇవి కూడా చదవండి

వర్షంలో కారు నడుపుతున్నారా? ఈ ట్రిక్ ఫాలో అవ్వండి

తమిళనాడు సీఎం విజయ్‌పై ఉదయనిధి వ్యక్తిగత విమర్శలు!

Updated Date - Jun 24 , 2026 | 04:57 AM