Share News

ఆచితూచి అడుగేయండి!

ABN , Publish Date - Oct 12 , 2026 | 05:19 AM

అంతర్జాతీయ పరిణామాలు అత్యంత వేగంగా మారుతున్న నేపథ్యంలో ఈ వారం ఇన్వెస్టర్లు అప్రమత్తంగా ఉండటమే మంచిది. ఫలితాల సీజన్‌ మొదలుకావటం మార్కెట్లో ఉత్సాహాన్ని నింపింది.

ఆచితూచి అడుగేయండి!

అంతర్జాతీయ పరిణామాలు అత్యంత వేగంగా మారుతున్న నేపథ్యంలో ఈ వారం ఇన్వెస్టర్లు అప్రమత్తంగా ఉండటమే మంచిది. ఫలితాల సీజన్‌ మొదలుకావటం మార్కెట్లో ఉత్సాహాన్ని నింపింది. అయితే చమురు ధరల కదలిక, యుద్ధాలు, అనిశ్చితి, అమెరికా సహా వివిధ దేశాల బాండ్‌ ఈల్డ్స్‌ పెరగటం వంటివి సూచీల గమనాన్ని నిర్దేశించనున్నాయి. గత వారం మధ్యలో బాగా నష్టపోయిన సూచీలు చివరలో పుంజుకోవటం సానుకూల అంశం. ఎఫ్‌ఎంసీజీ, బ్యాంకింగ్‌, ఫైనాన్స్‌ రంగాలు బలాన్ని ప్రదర్శిస్తుండగా రియల్టీ, మెటల్‌, కమోడిటీ, ఆటో రంగాల్లో బలహీనత కొనసాగుతోంది.

స్టాక్‌ రికమండేషన్స్‌

బజాజ్‌ కన్స్యూమర్‌: ఈ ఏడాది మార్చి నుంచి జూలైలో జీవితకాల గరిష్ఠాన్ని తాకే వరకు 350 శాతం రాబడిని ఇచ్చిన ఈ షేరు ప్రస్తుతం 35 శాతం మేర దిద్దుబాటుకు లోనైంది. అయితే 200 రోజుల మూవింగ్‌ యావరేజీ వద్ద మద్దతు తీసుకుని పుంజుకునే అవకాశం కనిపిస్తోంది. ఈపీఎస్‌, సేల్స్‌ మెరుగ్గా ఉండటమే ఇందుకు కారణం. గత శుక్రవారం రూ.506 వద్ద ముగిసిన ఈ కౌంటర్‌లో మదుపరులు రూ.500 శ్రేణిలో ప్రవేశించి రూ.550/580 టార్గెట్‌ ధరతో కొనుగోలు చేయవచ్చు. అయితే రూ.480 స్థాయిని స్టాప్‌లా్‌సగా పెట్టుకోవాలి.

ఫెడరల్‌ బ్యాంక్‌: ఏడాదిన్నరగా అప్‌ట్రెండ్‌లో కొనసాగిన ఈ షేరు ఆగస్టులో గరిష్ఠానికి చేరిన తర్వాత 15 శాతం మేర దిద్దుబాటుకు లోనైంది. ప్రస్తుతం 200 రోజుల మూవింగ్‌ యావరేజీ వద్ద మద్దతు తీసుకునే అవకాశం కనిపిస్తోంది. రిలేటివ్‌ స్ట్రెంత్‌ మెరుగ్గా ఉంది. గత శుక్రవారం రూ.330 వద్ద ముగిసిన ఈ కౌంటర్‌లో ఇన్వెస్టర్లు రూ.320 శ్రేణిలో ఎంటరై రూ.360 టార్గెట్‌ ధరతో కొనుగోలు చేయవచ్చు. అయితే రూ.315 స్థాయిని స్టాప్‌లా్‌సగా పెట్టుకోవాలి.


ఎస్‌బీఐ: జీవితకాల గరిష్ఠం తర్వాత ఈ షేరులో భారీగా దిద్దుబాటు జరిగింది. దాదాపు 23 శాతం మేర పతనమైంది. మూడు నెలల వ్యవధిలోనే మరోసారి రూ.950 శ్రేణిలో మద్దతు తీసుకుంది. ఫలితాల నేపథ్యంలో ఈ స్థాయి నుంచి మూమెంటమ్‌ లభించవచ్చు. గత శుక్రవారం రూ.959 వద్ద ముగిసిన ఈ కౌంటర్‌లో మదుపరులు రూ.950 శ్రేణిలో పొజిషన్‌ తీసుకుని రూ.1,050 టార్గెట్‌ ధరతో కొనుగోలు చేయవచ్చు. అయితే రూ.925 స్థాయిని స్టాప్‌లా్‌సగా పెట్టుకోవాలి.

ఎన్‌ఆర్‌బీ బేరింగ్స్‌: సుదీర్ఘకాలంగా ఈ షేరు అప్‌ట్రెండ్‌లో సాగుతోంది. తాజాగా మంచి వాల్యూమ్‌తో దీర్ఘకాల బేస్‌ను బ్రేకౌట్‌ చేసింది. నిఫ్టీతో పోల్చితే జోరును ప్రదర్శిస్తోంది. గత శుక్రవారం రూ.524 వద్ద ముగిసిన ఈ కౌంటర్‌లో మదుపరులు రూ.500 శ్రేణిలో ప్రవేశించి రూ.560/625 టార్గెట్‌ ధరతో కొనుగోలు చేయవచ్చు. అయితే రూ.475 స్థాయిని కచ్చితమైన స్టాప్‌లా్‌సగా పెట్టుకోవాలి.

మహీంద్రా అండ్‌ మహీంద్రా ఫైనాన్స్‌: మూడు నెలలుగా ఈ కౌంటర్‌ డౌన్‌ట్రెండ్‌లో ఉంది. దాదాపు 26 శాతం మేర దిద్దుబాటుకు లోనైంది. ఫలితాలు వస్తుండటం, రిలేటివ్‌ స్ట్రెంత్‌ పెరుగుతుండటం సానుకూల అంశాలు. గత శుక్రవారం రూ.319 వద్ద ముగిసిన ఈ కౌంటర్‌లో ఇన్వెస్టర్లు రూ.310 శ్రేణిలో ఎంటరై రూ.400 టార్గెట్‌ ధరతో కొనుగోలు చేయవచ్చు. అయితే రూ.300 స్థాయిని కచ్చితమైన స్టాప్‌లా్‌సగా పెట్టుకోవాలి.

- మూర్తి నాయుడు పాదం,

మార్కెట్‌ నిపుణులు, నిఫ్టీ మాస్టర్‌

+91 98855 59709

Updated Date - Oct 12 , 2026 | 05:20 AM