ప్రధాన వార్తా పత్రికల ముద్రణేతర వ్యాపార ఆదాయంలో 12 శాతం వృద్ధి
ABN , Publish Date - Aug 20 , 2026 | 05:41 AM
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2026-27)తో ముగియనున్న మూడేళ్ల కాలంలో ప్రధాన వార్తా పత్రికలకు డిజిటల్ ప్లాట్‌ఫామ్స్, అవుట్ ఆఫ్ హోమ్ అడ్వర్టైజింగ్, ఈవెంట్ మేనేజ్‌మెంట్ వంటి ...
క్రిసిల్ నివేదిక అంచనా
ముంబై: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2026-27)తో ముగియనున్న మూడేళ్ల కాలంలో ప్రధాన వార్తా పత్రికలకు డిజిటల్ ప్లాట్‌ఫామ్స్, అవుట్ ఆఫ్ హోమ్ అడ్వర్టైజింగ్, ఈవెంట్ మేనేజ్‌మెంట్ వంటి ముద్రణేతర వ్యాపారాల ద్వారా ఆదాయం 12శాతం వరకు పెరగవచ్చని ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ అంచనా వేసింది. అదే సమయంలో ముద్రణ వ్యాపార ఆదాయ వృద్ధి మాత్రం 3శాతం వరకు పరిమితం కావచ్చని అంటోంది. వార్తా పత్రికలకు పాఠకులు తగ్గుతుండటమే ఇందుకు కారణమని బుధవారం విడుదల చేసిన నివేదికలో క్రిసిల్ పేర్కొంది. అందుకే, ప్రధాన వార్తా పత్రికలు తమ ఉనికితో పాటు రుణ పరపతిని కాపాడుకునేందుకు కేవలం ముద్రణ ఆదాయంపైనే ఆధారపడటం లేదని అంటోంది. 2019లో 1.5 కోట్ల స్థాయిలో ఉన్న ప్రధాన వార్తా పత్రికల పాఠకుల సంఖ్య 2025 నాటికి కోటికి తగ్గిందని.. మున్ముందు మరింత తగ్గవచ్చని, యువ పాఠకులు డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌కు మళ్లుతుండటం ఇందుకు కారణమని నివేదిక పేర్కొంది.