డీఎస్సీ, అమరావతిలో అక్రమాలు: వైవీ
ABN , Publish Date - Jun 20 , 2026 | 05:41 AM
డీఎస్సీ పోస్టుల భర్తీలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు, స్పోర్ట్స్ కోటాలో అనర్హులకు అక్రమ పద్ధతిలో ఉద్యోగాలు దక్కాయని..
న్యూఢిల్లీ, జూన్ 19 (ఆంధ్రజ్యోతి): డీఎస్సీ పోస్టుల భర్తీలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు, స్పోర్ట్స్ కోటాలో అనర్హులకు అక్రమ పద్ధతిలో ఉద్యోగాలు దక్కాయని వైసీపీ పార్లమెంటరీ నేత వైవీ సుబ్బారెడ్డి శుక్రవారం ఆరోపించారు. అమరావతిలో నిర్మాణాల కోసం చదరపు అడుగుకు కూటమి ప్రభుత్వం రూ.20,500 ఖర్చు చేస్తోందని, అదే ప్రాంతంలో కేంద్రప్రభుత్వ కార్యాలయాల కోసం రూ.5 వేలు ఖర్చు చేస్తోందన్నారు. అవినీతి, అక్రమాలపై కేంద్రం సీబీఐతో దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేశారు.