అభివృద్ధి కాదు.. విధ్వంసం కావాలి!
ABN , Publish Date - Feb 06 , 2026 | 02:55 AM
ఎవరైనా అధికారంలోకి వస్తే అభివృద్ధి చేస్తాం, ప్రజల సంక్షేమం కోసం పాటుపడతాం.. అని చెబుతుంటారు. అయితే వైసీపీ నేతలు, కార్యకర్తల తీరు అందుకు ....
అందుకోసం ఎదురుచూపులు.. వైసీపీ ఫ్లెక్సీ వైరల్
ఎవరైనా అధికారంలోకి వస్తే అభివృద్ధి చేస్తాం, ప్రజల సంక్షేమం కోసం పాటుపడతాం.. అని చెబుతుంటారు. అయితే వైసీపీ నేతలు, కార్యకర్తల తీరు అందుకు విరుద్ధం. గత ప్రభుత్వ హయాంలో అరాచకాలు, విధ్వంసాలతో విసిగిన ప్రజలు ఎన్నికల్లో ఆ పార్టీకి బుద్ధి చెప్పినా ఏమాత్రం మార్పు రాలేదు. అదే ‘విధ్వంసం’, ‘రప్పా రప్పా’ నినాదాలు! ఆ పార్టీ శ్రేణులు విధ్వంసాన్నే కోరుకుంటున్నాయి. పల్నాడు జిల్లా రాజుపాలెం మండలం కోట నెమలిపురి గ్రామంలో ఏర్పాటు చేసిన ఓ ఫ్లెక్సీ ఇందుకు ఉదాహరణగా కనిపిస్తోంది. ‘నువ్వు సృష్టించే విఽధ్వంసం కోసం ఎదురు చూస్తున్నాం.. 2029’ అని అందులో రాసి ఉంది. గతేడాది జగన్ పుట్టినరోజు సందర్భంగా ఆ గ్రామంలో ఏర్పాటు చేసిన ఈ ఫ్లెక్సీ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీన్ని చూసిన వారు విధ్వంసం, రప్పా రప్పా అనేవి వైసీపీ పేటెంట్ పదాలుగా మారాయనుకుంటున్నారు.
- నరసరావుపేట-ఆంధ్రజ్యోతి