కొత్త డీఎస్సీని అడ్డుకోవడమే వైసీపీ అసలు ఎజెండా
ABN , Publish Date - Jun 12 , 2026 | 04:19 AM
డీఎస్సీలో స్పోర్ట్స్ కోటా నియామకాలపై మాజీ ముఖ్యమంత్రి జగన్ చేస్తున్న ఆరోపణలు రాజకీయ ప్రేరేపితమైనవని శాప్ చైర్మన్ రవి నాయుడు..
అన్ని ఆధారాలతో బహిరంగ చర్చకు సిద్ధం: శాప్ చైర్మన్ రవి నాయుడు
తిరుపతి సెంట్రల్, జూన్ 11(ఆంధ్రజ్యోతి): డీఎస్సీలో స్పోర్ట్స్ కోటా నియామకాలపై మాజీ ముఖ్యమంత్రి జగన్ చేస్తున్న ఆరోపణలు రాజకీయ ప్రేరేపితమైనవని శాప్ చైర్మన్ రవి నాయుడు ఆరోపించారు. తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ నిరుద్యోగ యువతలో అనుమానాలు రేకెత్తించి భవిష్యత్ నియామకాలను అడ్డుకోవడమే లక్ష్యంగా ఈ ప్రచారం సాగుతోందన్నారు. జగన్ చేస్తున్న విమర్శలను తీవ్రంగా ఖండించారు. స్పోర్ట్స్ కోటా నియామకాల విషయంలో ప్రభుత్వం పూర్తిస్థాయి పారదర్శకత పాటించిం దని తెలిపారు. డీఎస్సీ, స్పోర్ట్స్ కోటా నియామకాలపై ఎవరైనా ఆధారాలు, పత్రాలతో వస్తే ప్రజల సమక్షంలో బహిరంగ చర్చకు తాము సిద్ధంగా ఉన్నామని సవాల్ విసిరారు.