Share News

వైసీపీ సోషల్‌ మీడియా కార్యకర్త అరెస్టు

ABN , Publish Date - Mar 10 , 2026 | 04:48 AM

వైసీపీ సోషల్‌ మీడియా కార్యకర్తను అరెస్టు చేసినట్లు గుంటూరు జిల్లా తెనాలి రూరల్‌ సీఐ షేక్‌ నాయబ్‌ రసూల్‌ వెల్లడించారు.

వైసీపీ సోషల్‌ మీడియా కార్యకర్త అరెస్టు

తెనాలి క్రైం, మార్చి 9(ఆంధ్రజ్యోతి): వైసీపీ సోషల్‌ మీడియా కార్యకర్తను అరెస్టు చేసినట్లు గుంటూరు జిల్లా తెనాలి రూరల్‌ సీఐ షేక్‌ నాయబ్‌ రసూల్‌ వెల్లడించారు. సోమవారం రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌లో విలేకర్ల సమావేశంలో సీఐ షేక్‌ నాయబ్‌ రసూల్‌ వివరాలు వెల్లడించారు. ‘అంగలకుదురుకు చెందిన టీడీపీ మహిళా నాయకురాలు జెట్టి రేణుక ఇచ్చిన ఫిర్యాదు మేరకు అనంతపురం జిల్లా మద్దెలచెరువు బీసీ కాలనీకి చెందిన మాదిగుబ్బ అశోక్‌(28)ను అదుపులోకి తీసుకున్నాం. వైసీపీ సోషల్‌ మీడియా కార్యకర్తగా పని చేస్తున్న నిందితుడు ఫేక్‌ ప్రొఫైల్‌ క్రియేట్‌ చేసి జెట్టి రేణుకకు అప్రతిష్ఠ కలిగించేలా ఫేస్‌బుక్‌లో పోస్టులు పెట్టాడు. విచారణలో నిందితుడు నేరాన్ని అంగీకరించాడు. కోర్టులో హాజరు పరచగా న్యాయమూర్తి నిందితుడికి 14 రోజులు రిమాం డ్‌ విధించారు. గుంటూరు జిల్లా జైలుకు తరలించాం’ అని సీఐ తెలిపారు.

Updated Date - Mar 10 , 2026 | 04:50 AM