Share News

బడ్జెట్‌ మొత్తం అబద్ధాలు, అభూతకల్పనలే

ABN , Publish Date - Mar 07 , 2026 | 05:18 AM

‘బడ్జెట్‌ కేటాయింపులపై మండలిలో జరిగిన చర్చలోనూ మంత్రి పయ్యావుల కేశవ్‌ వాస్తవాలు చెప్పలేదు.

బడ్జెట్‌ మొత్తం అబద్ధాలు, అభూతకల్పనలే

  • ఏ ప్రశ్నకీ సమాధానం లేదు: వైసీపీ

అమరావతి, మార్చి 6(ఆంధ్రజ్యోతి): ‘బడ్జెట్‌ కేటాయింపులపై మండలిలో జరిగిన చర్చలోనూ మంత్రి పయ్యావుల కేశవ్‌ వాస్తవాలు చెప్పలేదు. గత ప్రభుత్వం అంటూ రాజకీయ ప్రసంగంచేసి సభను తప్పుదోవ పట్టించే యత్నం చేశారు’ అని వైసీపీ ఎమ్మెల్సీలు ఆరోపించారు. శుక్రవారం అసెంబ్లీ గేటు బయట పలువురు ఎమ్మెల్సీలు మీడియాతో మాట్లాడారు. ‘రెండేళ్లవుతున్నా ఇంకా వైసీపీపై నిందలు మోపడానికే మంత్రులు ప్రాధాన్యమిచ్చారు. కానీ కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీల గురించి మాట్లాడలేదు. ఏ ప్రశ్న అడిగినా ప్రభుత్వం వద్ద సమాధానం లేదు. బడ్జెట్‌ మొత్తం అబద్ధాలు, అభూతకల్పనలే’ అని ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి మండిపడ్డారు. ఎమ్మెల్సీ తూమాటి మాధవరావు మాట్లాడుతూ... బడ్జెట్‌ ప్రసంగాన్ని కూడా మంత్రి పయ్యావుల కేశవ్‌ రాజకీయ ప్రసంగంగా మార్చేశారని విమర్శించారు. సంపద సృష్టిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు 20నెలల్లోనే రూ.3.28లక్షల కోట్లు అప్పులు చేశారని అరుణ్‌కుమార్‌ పేర్కొన్నారు. ‘గిట్టుబాటు ధరలు దక్కక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. రోజుకి 8 మంది రైతులు, రైతు కూలీలు ఆత్మహత్య చేసుకుంటున్నారు’అని ఎమ్మెల్సీ వరుదు కల్యాణి ఆరోపించారు. బడ్జెట్‌లో ప్రధాన హామీల ఊసేలేదని రామసుబ్బారెడ్డి విమర్శించారు. అంగన్వాడీల వేతనాలు ఎప్పుడు పెంచుతారో చెప్పాలని కల్పలతారెడ్డి డిమాండ్‌ చేశారు.

Updated Date - Mar 07 , 2026 | 05:20 AM