అమరావతిపై విరుచుకుపడండి
ABN , Publish Date - Apr 12 , 2026 | 05:53 AM
అమరావతి రాజధానిపై విరుచుకుపడాలంటూ వైసీపీ సోషల్ మీడియాను ఆ పార్టీ రాష్ట్ర రాజకీయ సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి ఆదేశించారు.
అవినీతి జరుగుతోందంటూ బాగా ప్రచారం చేయండి: సజ్జల
అమరావతి, ఏప్రిల్ 11 (ఆంధ్రజ్యోతి): అమరావతి రాజధానిపై విరుచుకుపడాలంటూ వైసీపీ సోషల్ మీడియాను ఆ పార్టీ రాష్ట్ర రాజకీయ సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి ఆదేశించారు. అమరావతిలో భారీ అవినీతి జరుగుతోందని విస్తృతంగా ప్రచారం చేయాలని చెప్పారు. శనివారం తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ సామాజిక మాధ్యమ నిర్వాహకులతో ఆయన సమావేశమయ్యారు. రాజధాని అమరావతి పనులపై సమాచార హక్కు చట్టం(ఆర్టీఐ) కింద ఒక ఉద్యమంలా దరఖాస్తులు చేయాలని ఆదేశించారు. ఇందుకోసం పార్టీ ఆర్టీఐ విభాగంలో బలమైన టీమ్‌ను నియమించుకోవాలని సూచించారు. కూటమి ప్రభుత్వంలో వైఫల్యాలు ఉన్నాయంటూ పెద్దఎత్తున ప్రచారం చేసేందుకు సిద్ధంగా ఉండాలని వైసీపీ సామాజిక కార్యకర్తలను ఆదేశించారు. అమరావతి పేరిట దోపిడీ కొనసాగుతోందని ఆరోపించారు.