మాకు తక్కువ సమయం ఇచ్చారు
ABN , Publish Date - Apr 04 , 2026 | 04:54 AM
రాజ్యసభలో అమరావతి బిల్లుపై చర్చ సందర్భంగా వైసీపీకి తగిన సమయం కేటాయించలేదని రాజ్యసభ చైర్మన్ రాధాకృష్ణన్‌కు ఆపార్టీ ఎంపీల బృందం ఫిర్యాదు చేసింది.
రాజ్యసభ చైర్మన్‌కు వైసీపీ ఎంపీల ఫిర్యాదు
న్యూఢిల్లీ, ఏప్రిల్ 3(ఆంధ్రజ్యోతి): రాజ్యసభలో అమరావతి బిల్లుపై చర్చ సందర్భంగా వైసీపీకి తగిన సమయం కేటాయించలేదని రాజ్యసభ చైర్మన్ రాధాకృష్ణన్‌కు ఆపార్టీ ఎంపీల బృందం ఫిర్యాదు చేసింది. శుక్రవారం రాధాకృష్ణన్‌ను ఆయన నివాసంలో కలిసి వైవీ సుబ్బారెడ్డి వినతిపత్రం అందజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ‘సభలో మా బలానికి తగిన ప్రాధాన్యమివ్వకుండా పార్లమెంటరీ సంప్రదాయాలకు విరుద్ధంగా వ్యవహరించారు. దీనిపై విచారణ జరపాలి’ అన్నారు.