‘ఆంధ్రజ్యోతి’ సంస్థలను మూయించేస్తాం
ABN , Publish Date - Apr 09 , 2026 | 06:29 AM
వైసీపీ 2029లో తిరిగి అధికారంలోకి రాగానే తొలి సంతకంతో ‘ఆంధ్రజ్యోతి’ సంస్థలపై వేటు వేయాలని అధినేత జగన్‌ను కోరతామంటూ వైసీపీ మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి అన్నారు.
తిరిగి అధికారంలోకి రాగానే పత్రికపై వేటు వేస్తూ తొలి సంతకం చేస్తాం
ఆర్కేను జైల్లో పెట్టిస్తాం: మోదుగుల అవాకులు
గుంటూరు, ఏప్రిల్ 8(ఆంధ్రజ్యోతి): వైసీపీ 2029లో తిరిగి అధికారంలోకి రాగానే తొలి సంతకంతో ‘ఆంధ్రజ్యోతి’ సంస్థలపై వేటు వేయాలని అధినేత జగన్‌ను కోరతామంటూ వైసీపీ మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి అన్నారు. అమరావతిపై విషంకక్కుతూ మాజీ సీఎం జగన్ తెరపైకి తెచ్చిన ‘మావిగన్’ను ప్రశ్నించిన ఏబీఎన్ ‘‘వీకెండ్ కామెంట్’ మహిళలను అవమానించిందంటూ వైసీపీ నేత లు 2 రోజులుగా దాడులకు యత్నిస్తున్న విషయం తెలిసిం దే. బుఽధవారం గుంటూరులోని ‘ఆంధ్రజ్యోతి’ సిటీ కార్యాల యం వద్ద ఆ పార్టీ నేతలు రచ్చ చేశారు. ఉద్యోగులను భయభ్రాంతులకు గురిచేసేలా ప్రవర్తించారు. దమ్ముంటే తమ ముందుకు రావాలంటూ సిబ్బందిని తీవ్రస్వరంతో హెచ్చరించారు. ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఆంధ్రజ్యోతి ప్రతులను తగలబెట్టారు. ఈ సందర్భంగా రాధాకృష్ణపై అసభ్య పదజాలంతో నోరు పారేసుకున్నారు. ఇకపై తమ పార్టీ టార్గెట్ ‘ఆంధ్రజ్యోతే’నని ధ్వ నించేలా మీడియాతో మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి మాట్లాడారు. ఆంధ్రజ్యోతి సంస్థలను మూసి వేయిస్తామన్నారు. రాధాకృష్ణ జైలు ఊచలు లెక్కపెట్టక తప్పదని హెచ్చరించారు. కాగా, వైసీపీ నేతలు మోదుగుల, అంబటి రాంబా బు, అంబటి మురళీలపై గుంటూరు డీఎం సూదా రామచంద్రరావు అరండల్‌పేట స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. రాయడానికి వీలులేని పదజాలంతో దూషించారని ఆ ఫిర్యాదులో తెలిపారు. ‘మీ అంతు చూస్తాం...మీ సంగతి తేలుస్తాం’ అంటూ బెదిరించే ధోరణిలో భయాందోళనకు గురిచేశారని, చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు.