జగన్ వ్యాఖ్యలతో షాక్‌లో వైసీపీ నేతలు: కలిశెట్టి
ABN , Publish Date - Jan 12 , 2026 | 06:56 AM
అమరావతిపై జగన్ వ్యాఖ్యలతో వైసీపీ నేతలే షాక్ తిని తలలు పట్టుకుని కూర్చున్నారని ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అన్నారు.
ఇంటర్నెట్ డెస్క్: అమరావతిపై జగన్ వ్యాఖ్యలతో వైసీపీ నేతలే షాక్ తిని తలలు పట్టుకుని కూర్చున్నారని ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అన్నారు. జగన్ మాటల ప్రకారం.. ఆయన నివాసం ఉన్న తాడేపల్లి కూడా కృష్ణా నదీపరీవాహక ప్రాంతమేనని, మరి జగన్ ఇల్లు మునిగిందా అని ప్రశ్నించారు. ఏపీ అభివృద్ధిని అడ్డుకునేలా బెంగళూరు ప్యాలెస్‌లో కూర్చుని జగన్ పన్నుతున్న కుట్రలపై కేంద్ర దర్యాప్తు సంస్థలు విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు.