Share News

వైసీపీ నేతలు నిన్నటి వరకు విలన్లు.. నేడు జోకర్లు: గౌతు శిరీష

ABN , Publish Date - Apr 18 , 2026 | 03:13 AM

జగన్‌ నేతృత్వంలో వైసీపీ నేతలు ప్రభుత్వంపై చేస్తున్న అర్థంపర్థం లేని విమర్శలు చూస్తుంటే.. నిన్నటి వరకు వారిని కేవలం విలన్లుగానే...

వైసీపీ నేతలు నిన్నటి వరకు విలన్లు.. నేడు జోకర్లు: గౌతు శిరీష

అమరావతి, ఏప్రిల్‌ 17(ఆంధ్రజ్యోతి): జగన్‌ నేతృత్వంలో వైసీపీ నేతలు ప్రభుత్వంపై చేస్తున్న అర్థంపర్థం లేని విమర్శలు చూస్తుంటే.. నిన్నటి వరకు వారిని కేవలం విలన్లుగానే భావించిన రాష్ట్ర ప్రజలు ఇప్పుడు జోకర్లుగా చూసే పరిస్థితి ఏర్పడిందని ఎమ్మెల్యే గౌతు శిరీష అన్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. ‘తెలుగుదేశం వస్తే మహిళలపై అకృత్యాలు పెరిగిపోతాయంటూ మాజీ మంత్రి విడుదల రజని పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారు. ఆమె ఒక్కసారి ఎన్‌సీఆర్‌బీ 2023 నివేదిక చూడాలి. జగన్‌ ఐదేళ్ల పాలనలో నేరాలు ఏ స్థాయికి వెళ్లాయో ఆ నివేదిక స్పష్టం చేస్తుంది. దక్షిణాది రాష్ట్రాల్లో ఏపీని నేరాల్లో నంబర్‌ వన్‌గా నిలబెట్టిన ఘనత జగన్‌కి దక్కుతుంది. దళితులపై నేరాల్లోనూ నాడు ఏపీ నంబర్‌ వన్‌లో ఉంది. తల్లికి, చెల్లికి గౌరవం ఇవ్వని జగన్‌, రాష్ట్ర మహిళలకు మేలు చేశామని చెప్పుకోవడం ఈ శతాబ్దపు అతిపెద్ద జోక్‌ అన్నారు. మహిళలకు నిజమైన గౌరవం కల్పించింది చంద్రబాబు ఒక్కరే’ అని శిరీష స్పష్టం చేశారు.

Updated Date - Apr 18 , 2026 | 03:13 AM