Share News

నేను చెప్పినట్టు విను.. నీ కొడుక్కి పెళ్లి చేస్తా!

ABN , Publish Date - Apr 22 , 2026 | 05:11 AM

‘నేను చెప్పినట్టు విను. మంచి సంబంధం చూసి, దగ్గరుండి నీ కొడుక్కి పెళ్లి చేస్తా’ అంటూ మహిళ పట్ల ఓ వైసీపీ నాయకుడు అనుచితంగా ప్రవర్తించాడు.

నేను చెప్పినట్టు విను.. నీ కొడుక్కి పెళ్లి చేస్తా!

  • మహిళతో వైసీపీ నాయకుడి అనుచిత ప్రవర్తన

చెన్నేకొత్తపల్లి, ఏప్రిల్‌ 21(ఆంధ్రజ్యోతి): ‘నేను చెప్పినట్టు విను. మంచి సంబంధం చూసి, దగ్గరుండి నీ కొడుక్కి పెళ్లి చేస్తా’ అంటూ మహిళ పట్ల ఓ వైసీపీ నాయకుడు అనుచితంగా ప్రవర్తించాడు. శ్రీసత్యసాయి జిల్లా చెన్నేకొత్తపల్లి మండంలోని ఓ గ్రామానికి చెందిన మహిళ ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో వెళ్లిన ఆ నాయకుడు, ఆమెను ప్రలోభపెట్టి లోబరుచుకునే ప్రయత్నం చేశాడు. ఆమె తిరగబడటంతో అక్కడి నుంచి ఉడాయించాడు. విశ్వసనీయ సమాచారం మేరకు, మండల పరిధిలోని మేడాపురం గ్రామానికి చెందిన వైసీపీ నాయకుడు రాప్తాడు మాజీ ప్రజాప్రతినిధికి ప్రధాన అనుచరుడు. ఇదే మండలంలోని తన పొరుగు గ్రామానికి సోమవారం వెళ్లాడు. మహిళ భర్త, పిల్లలు బయటకు వెళ్లిన సమయంలో ఆమె ఇంట్లోకి ప్రవేశించాడు. మాయమాటలతో ఆమెను లోబరుచుకునే ప్రయత్నం చేశాడు. ‘నాకు నియోజకవర్గంలో పెద్ద నాయకుడైన మాజీ ప్రజాప్రతినిధి అండగా ఉన్నారు. నీకేం భయం లేదు. నీ కొడుక్కు మంచి సంబంధం చూసి పెళ్లి చేసే బాధ్యత నాది. నువ్వు ఒప్పుకొంటే చాలు..’ అంటూ ఆమెపై లైంగిక దాడికి ప్రయత్నించాడు. ఆ మహిళ తీవ్రంగా ప్రతిఘటించడంతో వైసీపీ నాయకుడు అక్కడి నుంచి ఉడాయించాడు. జరిగిన విషయాన్ని బాధిత మహిళ తన కుటుంబ సభ్యులకు తెలియజేశారు. ఈ విషయంపై మాజీ ప్రజాప్రతినిధి రాజీ చేసేందుకు ప్రయత్నించినట్టు తెలిసింది.

Updated Date - Apr 22 , 2026 | 05:15 AM