Share News

కాపుల తరఫున పోరాటం!

ABN , Publish Date - Jun 22 , 2026 | 05:32 AM

కూటమి ప్రభుత్వం కాపులపై దాష్టీకాలకు పాల్పడుతోందని, దీనిపై పోరాడాలని వైసీపీ కాపు నేతలు నిర్ణయించారు.

కాపుల తరఫున పోరాటం!

  • బాధితులకు అండగా ఉందాం

  • సాయికృష్ణ కుటుంబానికి ఆర్థిక సాయం

  • ఆత్మీయ సమావేశంలో తీర్మానాలు

అమలాపురం/ద్రాక్షారామ, జూన్‌ 21 (ఆంధ్రజ్యోతి): కూటమి ప్రభుత్వం కాపులపై దాష్టీకాలకు పాల్పడుతోందని, దీనిపై పోరాడాలని వైసీపీ కాపు నేతలు నిర్ణయించారు. ఆదివారం వెంకటాయపాలెంలోని ఒక కల్యాణ మండపంలో సుమారు నాలుగు గంటలపాటు వీరు చర్చలు జరిపారు. విజయవాడ కృష్ణలంకలో రౌడీ షీటర్‌ గాదె సాయికృష్ణ కేసును ప్రస్తావిస్తూ... రాష్ట్రంలో ఎక్కడైనా కాపులకు అన్యా యం జరిగితే... నేరుగా అక్కడికి వెళ్లి ధైర్యం చెప్పాలని తీర్మానించారు. దీనికోసం మూడు ప్రాంతాల్లో మూడు టాస్క్‌ఫోర్స్‌ కమిటీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. కాపు బాధితులకు క్లౌడ్‌ ఫండిం గ్‌ ద్వారా నిధులు సేకరించి ఆదుకోవాలని కూడా నిర్ణయించారు. భేటీకి హాజరైన నేతలంతా రూ.50వేలు తగ్గకుండా సేకరించి సాయికృష్ణ కుటుంబానికి ఆర్థికంగా అండగా నిలవాలని తీర్మానించారు. కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభరెడ్డి కోలుకుని తమ పక్షాన తిరిగి పోరాడాలని ఆకాంక్షిస్తూ తీర్మానం చేశారు. విశాఖలో, తిరుపతిలోనూ ఇలాంటి సమావేశాలు పెట్టాలని తీర్మానించారు. ‘‘ఈ సమావేశంపై మీడియాలో విభిన్న కథనాలు వచ్చా యి. ఇది ఒక వ్యక్తి కోసమో, ఒక సంఘటనను ఖండించడానికో పెట్టింది కాదు’’ అని కన్నబాబు పేర్కొన్నారు.


కాస్త శుభ్రమై‘నది’!

ఈ ఫొటోలు చూశారా?.. ఒడ్డున తీసే కొద్దీ చెత్త.. నదిలో తొలగించే కొద్దీ నాచు, వ్యర్థాలు, రంగు మారిపోతున్న నీళ్లు.. ఇది గోదారి ఆవేదనకు కారణమవుతున్న కాలుష్యం! తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం గోదావరి నది, రేవుల్లో పేరుకు పోతున్న వ్యర్థాలు.. దుర్వాసనపై ఈ నెల 18న ‘కాలుష్యమై నది’ శీర్షికతో ‘ఆంధ్రజ్యోతి’లో వార్త ప్రచురితమైంది. అలాగే డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ ఈ నెల 22(నేడు)న రాజమహేంద్రవరం రానున్నారని ముందుగా సమాచారం వచ్చింది. దీంతో ఆదివారం పలు ఘాట్లు, నదిలో వ్యర్థాలను తొలగించే పనిని అధిరానేలే కాస్త చిత్తశుద్ధితో చేపట్టారు. ఒడ్డున ఉన్న వ్యర్థాలను, గోదావరిలో పడవలతో నాచును తీయించి తరలించారు. నదిలో వ్యర్థాలు తీస్తున్న కొద్దీ వస్తూనే ఉన్నాయి. దీంతో కనబడే మేర శుభ్రం చేశారు.

- రాజమహేంద్రవరం, ఆంధ్రజ్యోతి

Updated Date - Jun 22 , 2026 | 05:34 AM