Share News

వైసీపీ హయాంలో వ్యాపారులకు వేధింపులు

ABN , Publish Date - May 17 , 2026 | 04:30 AM

వైసీపీ ప్రభుత్వం వ్యాపారులను వేధిస్తే కూటమి ప్రభుత్వం వారికి అండగా నిలుస్తోందని ఆర్యవైశ్య కార్పొరేషన్‌ చైర్మన్‌ డూండీ రాకేశ్‌ తెలిపారు.

వైసీపీ హయాంలో వ్యాపారులకు వేధింపులు

  • కూటమి హయాంలో అండదండలు: డూండీ రాకేశ్‌

అమరావతి, మే 16(ఆంధ్రజ్యోతి): వైసీపీ ప్రభుత్వం వ్యాపారులను వేధిస్తే కూటమి ప్రభుత్వం వారికి అండగా నిలుస్తోందని ఆర్యవైశ్య కార్పొరేషన్‌ చైర్మన్‌ డూండీ రాకేశ్‌ తెలిపారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో శనివారం విలేకరులతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని వైసీపీ పేటీఎం బ్యాచ్‌ జీర్ణించుకోలేకపోతోందన్నారు. పశ్చిమాసియా సంక్షోభ ప్రభావం ఉన్నప్పటికీ.. రాష్ట్ర ప్రజలపై ఎలాంటి భారాలూ మోపకుండా పాలన సాగిస్తున్నామని తెలిపారు. అయినప్పటికీ వైసీపీ విమర్శలు చేయడం దారుణమన్నారు. ఐదేళ్ల వైసీపీ పాలనపైన.. రెండేళ్ల కూటమి పాలనపై వైసీపీ నేతలతో చర్చకు సిద్ధమన్నారు.

Updated Date - May 17 , 2026 | 04:30 AM