వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లికి బెయిలు
ABN , Publish Date - Mar 19 , 2026 | 05:15 AM
వైసీపీ నేత, పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి బెయిల్ మంజూరైంది.
మాచర్ల, మార్చి 18(ఆంధ్రజ్యోతి): వైసీపీ నేత, పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి బెయిల్ మంజూరైంది. వెల్దుర్తి మండలం గుండ్లపాడులో గత ఏడాది మేలో టీడీపీ నేతలు, సోదరులైన జెవిశెట్టి వెంకటేశ్వర్లు, జెవిశెట్టి కోటేశ్వరరావులు హత్యకు గురయ్యరు. ఆ కేసులో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి(ఏ 6), ఆయన సోదరుడు పిన్నెల్లి వెంకట్రామిరెడ్డి(ఏ 7) నిందితులుగా ఉన్నారు. గురజాల 10వ అదనపు కోర్టు జడ్జి ప్రియదర్శిని బుధవారం పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి బెయిల్ మంజూరు చేశారు.