Share News

రాజధాని విషయంలో వైసీపీది సెల్ఫ్‌ గోల్‌

ABN , Publish Date - Apr 13 , 2026 | 06:12 AM

రాజధాని అమరావతి విషయంలో వైసీపీది సెల్ఫ్‌గోల్‌ అని, టీడీపీది సెల్ఫ్‌ డబ్బా అని కాంగ్రెస్‌ నేత ఎన్‌.తులసిరెడ్డి విమర్శించారు.

రాజధాని విషయంలో వైసీపీది సెల్ఫ్‌ గోల్‌

  • పదేళ్లుగా అమరావతి నుంచే పరిపాలన: తులసిరెడ్డి

వెదురుకుప్పం, ఏప్రిల్‌ 12(ఆంధ్రజ్యోతి): రాజధాని అమరావతి విషయంలో వైసీపీది సెల్ఫ్‌గోల్‌ అని, టీడీపీది సెల్ఫ్‌ డబ్బా అని కాంగ్రెస్‌ నేత ఎన్‌.తులసిరెడ్డి విమర్శించారు. ఆదివారం చిత్తూరు జిల్లా కార్వేటినగరం మండలం పాదిరికుప్పంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ 2019 ఎన్నికలకు ముందు రాజధాని అమరావతి అని చెప్పిన వైసీపీ.. అధికారంలోకి వచ్చాక మూడు రాజధానులంటూ గందరగోళంలోకి నెట్టిందని, ఇప్పుడు అధికారం పోయాక ‘మావిగన్‌’ అంటూ కొత్తపల్లవి అందుకుందని ఎద్దేవా చేశారు. బహుశా రేపు శ్రీవిపుల్‌(శ్రీకాకుళం, విజయవాడ, పులివెందుల) అనొచ్చని, ఎల్లుండి శ్రీకాకుళం, విజయవాడ, కుప్పం అని కూడా అనొచ్చని వ్యంగ్యంగా మాట్లాడారు. విభజన చట్టంలోని సెక్షన్‌ 46 సబ్‌ సెక్షన్‌ 3 ప్రకారం రాయలసీమకు, ఉత్తరాంధ్రకు కేంద్రం బుందేల్ఖండ్‌ తరహా ప్రత్యేక అభివృద్ధి ఫ్యాకేజీ నిధులు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

Updated Date - Apr 13 , 2026 | 06:12 AM