వైసీపీ పాలనలోనే రూల్ ఆఫ్ ఫియర్: ధూళిపాళ్ల
ABN , Publish Date - Jul 02 , 2026 | 03:50 AM
జగన్‌రెడ్డి ప్రెస్‌మీట్‌లో చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉంది. పాముకి రెండే నాలుకలు... జగన్‌కు లెక్కలేనన్ని...
అమరావతి, జూలై 1(ఆంధ్రజ్యోతి): ‘జగన్‌రెడ్డి ప్రెస్‌మీట్‌లో చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉంది. పాముకి రెండే నాలుకలు... జగన్‌కు లెక్కలేనన్ని’ అని ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర విమర్శించారు. ‘రాజధాని విషయంలో ఊసరవెల్లిలా రంగులు మార్చాడు. మూడు రాజధానుల పేరుతో అటు ఉత్తరాంధ్ర ప్రజలను ఇటు సీమవాసులను మోసం చేసి ఇప్పుడు మావిగన్ అంటూ కొత్త రాగం ఎత్తుకున్నాడు. నేడు రాష్ట్రంలో రూల్ ఆఫ్ ఫియర్(భయాందోళన పాలన) లేదు. కేవలం రూల్ ఆఫ్ లా(చట్టబద్ధమైన పాలన) నడుస్తోంది’ అని అన్నారు. రాష్ట్ర టీడీపీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు ధారునాయక్ మాట్లాడుతూ, మూడు రాజధానుల పేరుతో రాష్ట్రాభివృద్ధిని తీవ్రంగా దెబ్బతీసిన జగన్ ఇప్పుడు మావిగన్ పేరతో మరో మాయాజాల ఆటకు తెరదీశారని విమర్శించారు.