Share News

పార్టీ ఎఫ్‌బీ పేజీ నిలిపివేతపై హైకోర్టుకు వైసీపీ

ABN , Publish Date - Jun 17 , 2026 | 04:38 AM

భారత దేశంలో తమ పార్టీ ఫేక్‌బుక్‌ పేజీని మెటా సంస్థ నిలిపివేయడంపై వైసీపీ హైకోర్టును ఆశ్రయించింది.

పార్టీ ఎఫ్‌బీ పేజీ నిలిపివేతపై హైకోర్టుకు వైసీపీ

అమరావతి, జూన్‌ 16(ఆంధ్రజ్యోతి): భారత దేశంలో తమ పార్టీ ఫేక్‌బుక్‌ పేజీని మెటా సంస్థ నిలిపివేయడంపై వైసీపీ హైకోర్టును ఆశ్రయించింది. ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి ఈ పిటిషన్‌ దాఖలు చేశారు. ఏ ప్రభుత్వ అధికారి, ఏజెన్సీ ఆదేశాలకు అనుగుణంగా చర్యలు తీసుకున్నారో, ఏ కంటెంట్‌ ఆధారంగా నిర్ణయం తీసుకున్నారో అందుకు సంబంధించిన నోటీసులు, ఉత్తర ప్రత్యుత్తరాలు వంటి పూర్తి వివరాలను తమకు అందజేసేలా మెటా సంస్థ(ఫే్‌సబుక్‌)ను ఆదేశించాలని పిటిషన్‌లో కోరారు. ఐటీ చట్టంలోని సెక్షన్‌ 79(3)(బి) ప్రకారం కంటెంట్‌ను తొలగించాలని ఇచ్చిన నోటీసు వివరాలను సంబంధిత ఖాతాదారుడికి అందజేయాల్సిన బాధ్యత సోషల్‌ మీడియా సంస్థపై ఉంటుందన్నారు. పిటిషనర్‌కు నోటీసు వివరాలు అందజేయకపోవడం రాజ్యాంగ, చట్టవిరుద్ధమైనదిగా ప్రకటించాలని కోరారు.

Updated Date - Jun 17 , 2026 | 04:38 AM