విచారణకు హాజరైన మరో ఇద్దరు ఎమ్మెల్సీలు
ABN , Publish Date - Feb 27 , 2026 | 04:14 AM
తమ పదవులకు రాజీనామా చేసిన ఇద్దరు వైసీపీ ఎమ్మెల్సీలు బల్లి కల్యాణ్ చక్రవర్తి, మర్రి రాజశేఖర్ గురువారం మండలి చైర్మన్ మోషేన్ రాజు వద్ద విచారణకు హాజరయ్యారు.
చైర్మన్‌తో కల్యాణ్ చక్రవర్తి, మర్రి రాజశేఖర్ భేటీ
అమరావతి, ఫిబ్రవరి 26(ఆంధ్రజ్యోతి): తమ పదవులకు రాజీనామా చేసిన ఇద్దరు వైసీపీ ఎమ్మెల్సీలు బల్లి కల్యాణ్ చక్రవర్తి, మర్రి రాజశేఖర్ గురువారం మండలి చైర్మన్ మోషేన్ రాజు వద్ద విచారణకు హాజరయ్యారు. రాజీనామా చేసిన ఎమ్మెల్సీలకు నోటీసులు ఇచ్చిన మోషేన్ రాజు వారిని విచారణకు పిలిపిస్తున్నారు. జయమంగళం వెంకటరమణ బుధవారం విచారణకు హాజరుకాగా, గురువారం ఈ ఇద్దరు వచ్చారు. రాజీనామా ఎందుకు చేస్తున్నారు? ఎవరైనా ఒత్తిడి చేశారా.. బెదిరించారా? అని వారిని చైర్మన్‌పశ్నించారు. తాము స్వచ్ఛందంగానే రాజీనామా చేశామని, తమ రాజీనామాలను వెంటనే ఆమోదించాలని ఎమ్మెల్సీలిద్దరూ కోరారు.