Share News

అన్నీ తెలిసే.. నన్ను ఆడుకుంటున్నారుగా!

ABN , Publish Date - Feb 19 , 2026 | 05:22 AM

అసెంబ్లీ ఆవరణలో మంత్రి గొట్టిపాటి రవికుమార్‌, టీడీపీ ఎమ్మెల్యేలు ఏలూరి సాంబశివరావు, ఎంఎస్‌ రాజు తదితరులు మాట్లాడుకుంటున్న సమయంలో...

అన్నీ తెలిసే.. నన్ను ఆడుకుంటున్నారుగా!

  • టీడీపీ ఎమ్మెల్యేలతో వైసీపీ ఎమ్మెల్యే చంద్రశేఖర్‌

అమరావతి, ఫిబ్రవరి 18(ఆంధ్రజ్యోతి): అసెంబ్లీ ఆవరణలో మంత్రి గొట్టిపాటి రవికుమార్‌, టీడీపీ ఎమ్మెల్యేలు ఏలూరి సాంబశివరావు, ఎంఎస్‌ రాజు తదితరులు మాట్లాడుకుంటున్న సమయంలో ఎర్రగొండపాలెం వైసీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్‌ అక్కడికి వచ్చారు. ‘బిల్‌ గేట్స్‌ స్థాయి తెలియకుండా ఆయన్ను కూడా విమర్శించే స్థాయికి మీ పార్టీ దిగజారిపోయిందేంటి? అసెంబ్లీకి వచ్చి బడ్జెట్‌ లెక్కలు అడక్కుండా ప్రెస్‌మీట్‌ పెట్టి బిల్‌ గేట్స్‌ టీ, కాఫీ ఖర్చులు చెప్పాలనడం ఏమిటి?’ అంటూ టీడీపీ ఎమ్మెల్యేలు ఆయనపై ప్రశ్నల వర్షం కురిపించారు. చంద్రశేఖర్‌ స్పందిస్తూ.. ‘అన్నీ తెలిసే నన్ను ఆడుకుంటున్నారుగా.. మీకో నమస్కారం’ అంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు.

Updated Date - Feb 19 , 2026 | 05:24 AM