Share News

మాట మార్పు మోదీకి అలవాటే: షర్మిల

ABN , Publish Date - Apr 20 , 2026 | 03:32 AM

మహిళా రిజర్వేషన్‌ బిల్లుపై మాట మార్చడం ప్రధాని మోదీకి అలవాటేనని పీసీసీ అధ్యక్షురాలు షర్మిల ఆరోపించారు.

మాట మార్పు మోదీకి అలవాటే: షర్మిల

అమరావతి, ఏప్రిల్‌ 19(ఆంధ్రజ్యోతి): మహిళా రిజర్వేషన్‌ బిల్లుపై మాట మార్చడం ప్రధాని మోదీకి అలవాటేనని పీసీసీ అధ్యక్షురాలు షర్మిల ఆరోపించారు. మహిళలకు క్షమాపణలు చెప్పడం కాదని, ప్రత్యేకంగా రిజర్వేషన్‌ బిల్లు పార్లమెంటులో పెట్టి ఆమోదింపచేయాలని ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. డీలిమిటేషన్‌ సహా మరే ఇతర అంశాన్ని జోడించకుండా కేవలం మహిళా రిజర్వేషన్‌ బిల్లును పార్లమెంటులో పెడితే బేషరతుగా ఆమోదిస్తామన్నారు. ప్రతిపక్షాలపై మోదీ పెడబొబ్బలు పెడుతున్నారని, మహిళా శక్తిని అడ్డుకున్నారంటూ మొసలి కన్నీరు కారుస్తున్నారని విమర్శించారు.

Updated Date - Apr 20 , 2026 | 03:32 AM