Share News

వసతులు కల్పించలేని ప్రభుత్వాలెందుకు: షర్మిల

ABN , Publish Date - Mar 06 , 2026 | 05:08 AM

గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పించలేని ప్రభుత్వాలు ఉంటే ఎంత? ఊడితే ఎంత? అని పీసీసీ అధ్యక్షురాలు వై.ఎస్.షర్మిల మండిపడ్డారు.

వసతులు కల్పించలేని ప్రభుత్వాలెందుకు: షర్మిల

వత్సవాయి, మార్చి 5(ఆంధ్రజ్యోతి): గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పించలేని ప్రభుత్వాలు ఉంటే ఎంత? ఊడితే ఎంత? అని పీసీసీ అధ్యక్షురాలు వై.ఎస్.షర్మిల మండిపడ్డారు. ఎన్టీఆర్‌ జిల్లా వత్సవాయి మండలం కన్నెవీడులో ఉపాధి హామీ పథకం పరిరక్షణలో భాగంగా గురువారం రచ్చబండలో ఆమె పాల్గొని మాట్లాడారు. ‘ఉపాధి హామీ పథకం వైఎ్‌సఆర్‌ ఆశయాల నుంచి పుట్టింది. పేదల కడుపు నింపే ఉపాధిపై బీజేపీ ప్రభుత్వం కుట్రలు చేస్తూ పూర్తిగా రద్దు చేయాలని చూస్తోంది. రామ్‌జీ చట్టం పెట్టి కాంట్రాక్టర్లను రంగంలోకి తీసుకువచ్చి ఉపాధి కూలీల శ్రమను దోచుకోవాలనుకుంటున్నారు. రాష్ట్రానికి నిఽధుల విడుదలపై వైసీపీ నోరు మెదపడం లేదు’ అని షర్మిల అన్నారు.

Updated Date - Mar 06 , 2026 | 05:09 AM