గాంధీ ఆశయాలకు తూట్లు పొడుస్తున్న బీజేపీ
ABN , Publish Date - Feb 19 , 2026 | 04:57 AM
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మహాత్మాగాంధీ పేరుకు, ఆయన ఆశయాలకు తూట్లు పొడుస్తోందని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపించారు.
పీసీసీ అధ్యక్షురాలు షర్మిల
గోస్పాడు/శిరివెళ్ల, ఫిబ్రవరి 18(ఆంధ్రజ్యోతి): కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మహాత్మాగాంధీ పేరుకు, ఆయన ఆశయాలకు తూట్లు పొడుస్తోందని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపించారు. ఉపాధి హామీ పరిరక్షణ యాత్రలో భాగంగా బుధవారం ఉదయం నంద్యాల జిల్లా గోస్పాడు మండలం కానాలపల్లె గ్రామంలో, సాయంత్రం శిరివెళ్లలో రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించారు. కానాలపల్లెలో షర్మిల మాట్లాడుతూ.. ‘మహాత్మా గాంధీని చంపిన గాడ్సే... ఉపాధి హామీ పథకానికి మహాత్మా గాంధీ పేరును తొలగించిన ప్రధాని నరేంద్ర మోదీ ఒక్కటేనని మండిపడ్డారు. శిరివెళ్లలో మాట్లాడుతూ.. రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకురావడంలో, పోలవరం నిర్మాణం పూర్తి చేయడంలో మాజీ సీఎం జగన్మోహన్‌రెడ్డి, ప్రస్తుతం సీఎం చంద్రబాబు విఫలమయ్యారని ఆరోపించారు.