Share News

ఏపీకి తీరని అన్యాయం చేస్తున్న బీజేపీ

ABN , Publish Date - Feb 20 , 2026 | 03:09 AM

రాష్ట్రం విడిపోయి పదకొండేళ్లు గడుస్తున్నా రాజధాని ఏర్పాటు చేసుకోలేని ఆంధ్రప్రదేశ్‌కు బీజేపీ తీరని అన్యాయం చేస్తోందని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల విమర్శించారు.

ఏపీకి తీరని అన్యాయం చేస్తున్న బీజేపీ

  • వేల్పూరు రచ్చబండలో పీసీసీ అధ్యక్షురాలు షర్మిల

వేల్పూరు(శావల్యాపురం), ఫిబ్రవరి 19 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రం విడిపోయి పదకొండేళ్లు గడుస్తున్నా రాజధాని ఏర్పాటు చేసుకోలేని ఆంధ్రప్రదేశ్‌కు బీజేపీ తీరని అన్యాయం చేస్తోందని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల విమర్శించారు. పల్నాడు జిల్లా శావల్యాపురం మండలం వేల్పూరులో గురువారం జరిగిన రచ్చబండ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ అధికారంలో ఉన్న టీడీపీ, జనసేన, ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ ప్రశ్నించడం మానేసి బీజేపీకి బానిసలుగా మారాయని ఆరోపించారు. రాష్ట్రానికి 11 ఏళ్ల క్రితమే ప్రత్యేక హోదా రావాల్సి ఉందని, కానీ చంద్రబాబు, జగన్మోహన్‌రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు బీజేపీని అడగకుండా మోదీకి భజనలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు, జగన్మోహన్‌రెడ్డి ఇద్దరూ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని, ఇప్పటికే రూ.11 లక్షల కోట్లు అప్పులు చేశారన్నారు. పోలవరం ఎత్తు తగ్గిస్తూ బీజేపీ ప్రభుత్వం పార్లమెంట్‌లో చట్టం చేస్తుంటే నిలదీయాల్సిన నాటి సీఎం జగన్మోహన్‌రెడ్డి మద్దతు ఇవ్వడం సిగ్గుచేటని మండిపడ్డారు.

Updated Date - Feb 20 , 2026 | 03:09 AM