Share News

పెట్టుబడి సాయాన్ని మొక్కుబడి చేశారు: షర్మిల

ABN , Publish Date - Jun 21 , 2026 | 06:34 AM

వరుసగా మూడో ఏడాది కూడా అన్నదాతా దుఃఖీభవగానే మారుస్తూ.... రైతుల ఖాతాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు అరకొరగా నిధులు విదిల్చారని..

పెట్టుబడి సాయాన్ని మొక్కుబడి చేశారు: షర్మిల

అమరావతి, జూన్‌ 20(ఆంధ్రజ్యోతి): వరుసగా మూడో ఏడాది కూడా అన్నదాతా దుఃఖీభవగానే మారుస్తూ.... రైతుల ఖాతాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు అరకొరగా నిధులు విదిల్చారని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిలరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్నదాత సుఖీభవ నిధులను రైతుల ఖాతాల్లోకి శనివారం రాష్ట్ర ప్రభుత్వం వేసింది. దీనిపై షర్మిల ఎక్స్‌ వేదికగా స్పందించారు. రాష్ట్రంలో 60 లక్షల మంది రైతులు పథకానికి అర్హులైతే... కేవలం 46.86 లక్షల మందికే నిధులు జమచేసి.. వరుసగా మూడో ఏడాది రైతులను చంద్రబాబు దగా చేశారని ఆరోపించారు. తొలి ఏడాది పూర్తిగా ఎగ్గొట్టి... రెండో ఏడాది రైతుల సంఖ్యకు కత్తెర వేశారని ఆరోపించారు. పంటలకు మద్దతు ధరకు మంగళం పాడారని, బీమాకు ధీమా లేకుండా పోయిందని అన్నారు. కేంద్రం ఇచ్చే సాయంతో సంబంధం లేకుండానే రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవను అమలు చేస్తుందని చెప్పి దగా చేశారని మండిపడ్డారు. రైతుకు ఇచ్చిన మాట తప్పినందుకు చంద్రబాబు క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు.

Updated Date - Jun 21 , 2026 | 06:36 AM