Share News

చంద్రబాబుతో ఆర్టీసీకి ముప్పే: షర్మిల

ABN , Publish Date - Jun 24 , 2026 | 05:45 AM

చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడల్లా ఆర్టీసీకి ముప్పేనని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిలరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

చంద్రబాబుతో ఆర్టీసీకి ముప్పే: షర్మిల

అమరావతి, జూన్‌ 23(ఆంధ్రజ్యోతి): చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడల్లా ఆర్టీసీకి ముప్పేనని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిలరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నాడు అద్దె బస్సుల నుంచి నేటి ఈ-బస్సుల వరకూ అన్నీ ప్రైవేటీకరణ చర్యలేనని మంగళవారం ఒక ప్రకటనలో విమర్శించారు. రోడ్డు రవాణా సంస్థను ప్రైవేటీకరణ చేసేందుకు చంద్రబాబు చేయని ప్రయత్నాలు లేవన్నారు. పేదవాడి రవాణా వ్యవస్థను అమ్మేసేవిధంగా కూటమి ప్రభుత్వం సైలెంట్‌ కిల్లింగ్‌ పాలసీని అమలు చేస్తోందని విమర్శించారు. ఆర్టీసీ అస్తిత్వాన్ని దెబ్బతీయాలని చూస్తే సహించేదిలేదని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఎలక్ట్రికల్‌ బస్సులను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడం సరికాదన్నారు. ఆర్టీసీలో ఖాళీగా ఉన్న పది వేల పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్‌ చేశారు.

Updated Date - Jun 24 , 2026 | 05:45 AM