Share News

షర్మిలకు కాంగ్రెస్‌ మొండిచేయి!

ABN , Publish Date - Jun 05 , 2026 | 05:40 AM

రాజ్యసభ సీటు విషయంలో పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిలారెడ్డికి నిరాశే ఎదురైంది. కర్ణాటక నుంచి ఆమెను ఎగువ సభకు కాంగ్రెస్‌ అధిష్ఠానం పంపనుందని...

షర్మిలకు కాంగ్రెస్‌ మొండిచేయి!

  • కర్ణాటక నుంచి రాజ్యసభకు ఎంపిక చేయని అధిష్ఠానం

అమరావతి, జూన్‌ 4 (ఆంధ్రజ్యోతి): రాజ్యసభ సీటు విషయంలో పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిలారెడ్డికి నిరాశే ఎదురైంది. కర్ణాటక నుంచి ఆమెను ఎగువ సభకు కాంగ్రెస్‌ అధిష్ఠానం పంపనుందని పెద్దఎత్తున ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. దీనిపై చర్చించేందుకు ఆమె భర్త అనిల్‌తో పాటు ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో భేటీ అయ్యారు. పార్టీలో చేరే సమయంలోనే రాజ్యసభ సీటు ఇస్తామని హామీ ఇచ్చారని గుర్తుచేశారు. కాంగ్రె్‌సలోకి ఆమెను తీసుకురావడంలో కీలక భూమిక పోషించిన నాటి కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు, ప్రస్తుత సీఎం డీకే శివకుమార్‌ తనకు రాజ్యసభ విషయంలో గట్టిగా నిలబడతారని షర్మిల భావించారు. అయితే ఆఖరి నిమిషంలో కాంగ్రెస్‌ ఆ రాష్ట్రం నుంచి ఖర్గేను తిరిగి రాజ్యసభకు పంపాలని నిర్ణయించింది. అదేవిధంగా ఏఐసీసీ మీడియా ఇన్‌చార్జి పవన్‌ ఖేరా, కర్ణాటక కాంగ్రెస్‌ నేత మన్సూర్‌ అలీఖాన్‌లకు కూడా అక్కడి నుంచి అవకాశం కల్పించింది. చివరి నిమిషంలో ఖేరాను తీసుకురావడం.. షర్మిలను తప్పించడం వెనుక ఉన్న రాజకీయశక్తి ఎవరనేది ఇప్పుడు ఆమె శిబిరంలో జోరుగా చర్చ జరుగుతోంది.

Updated Date - Jun 05 , 2026 | 05:40 AM