జగన్.. మావిగన్ జోకర్
ABN , Publish Date - Apr 10 , 2026 | 04:04 AM
‘జగన్... మూడు రాజధానుల పేరుతో రుషికొండను మింగేసి సొంతానికి ప్యాలె్‌సలు కట్టుకున్నారు. ఇప్పుడు మావిగన్ జోకర్’గా మిగిలారు. నాన్నకు వారసుడిని అని చెప్పుకొనే ఆయన...
వైఎస్ పేరును వాడుకున్నారు తప్పితే ఆయన ఆశయాలకు వారసుడు కాలేదు: షర్మిల
అమరావతి, ఏప్రిల్ 9(ఆంధ్రజ్యోతి): ‘‘జగన్... మూడు రాజధానుల పేరుతో రుషికొండను మింగేసి సొంతానికి ప్యాలె్‌సలు కట్టుకున్నారు. ఇప్పుడు మావిగన్ జోకర్’గా మిగిలారు. నాన్నకు వారసుడిని అని చెప్పుకొనే ఆయన... వైఎస్ఆర్ పేరును వాడుకున్నారు తప్పితే, ఆయన ఆశయాలకు వారసుడు కాలేదు’’ అని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. రాజశేఖరరెడ్డి ‘ప్రజాప్రస్థానం’ పాదయాత్ర 23 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆమె గురువారం ఎక్స్ వేదికగా స్పందించారు. ‘‘వైసీపీలో నిజంగా వైఎస్ ఐడియాలజీ ఉంటే జగన్ సీఎం ఆయ్యాక జల యజ్ఞాన్ని ఎందుకు పూర్తి చేయలేదు? ‘మాట తప్పం... మడం తిప్పం’ అన్న వైఎ్‌సఆర్ లైన్ మాత్రమే వాడుకున్నారు. పూర్తి మద్యపాన నిషేధమని మాట ఇచ్చి, కల్తీ మద్యం అమ్మి, ‘ఓన్లీ క్యాష్’ మాఫియా ఎందుకు చేశారు? వైఎస్ వ్యతిరేకించిన బీజేపీకి దత్తపుత్రుడుగా ఎందుకు మారారు? దళితులపై, క్రిస్టియన్లపై దాడులు జరుగుతుంటే, జగన్... మౌనంగా ఎందుకున్నారు? వైఎస్ ఐడియాలజీ కాంగ్రె్‌సతోనే సాధ్యం’ అని పేర్కొన్నారు.