Share News

సీమ లిఫ్టుపై ఆందోళనా.. వైసీపీకి సిగ్గుండాలి

ABN , Publish Date - Feb 07 , 2026 | 05:22 AM

‘రాయలసీమ ఎత్తిపోతల పథకంపై ఆందోళనలు చేయడానికి వైసీపీకి సిగ్గుండాలి. అధికారంలో ఉన్న ఐదేళ్లూ మోదీకి దత్తపుత్రుడిగా ఉన్న జగన్‌, కేంద్రంపై ఎందుకు ఒత్తిడి తేలేదు?

సీమ లిఫ్టుపై ఆందోళనా.. వైసీపీకి సిగ్గుండాలి

  • బాబు, జగన్‌... ఇద్దరూ సీమ ద్రోహులే: షర్మిల

గంగాధరనెల్లూరు/పలమనేరు, ఫిబ్రవరి 6(ఆంధ్రజ్యోతి): ‘రాయలసీమ ఎత్తిపోతల పథకంపై ఆందోళనలు చేయడానికి వైసీపీకి సిగ్గుండాలి. అధికారంలో ఉన్న ఐదేళ్లూ మోదీకి దత్తపుత్రుడిగా ఉన్న జగన్‌, కేంద్రంపై ఎందుకు ఒత్తిడి తేలేదు?’ అని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ప్రశ్నించారు. చిత్తూరు జిల్లా గంగాధరనెల్లూరులో శుక్రవారం జరిగిన బహిరంగ సభలో ఆమె ప్రసంగించారు. ‘వైసీపీ అధికారంలో ఉండగా సీమ ఎత్తిపోతల పథకాన్ని ఎందుకు పూర్తి చేయలేదు? ఎన్జీటీ దగ్గర అనుమతుల కోసం వాదనలు ఎందుకు వినిపించలేదు? అనుమతులు వచ్చేలా కేంద్రాన్ని ఎందుకు ఒప్పించలేదు?’ అంటూ ప్రశ్నలు సంధించారు. చంద్రబాబు, జగన్‌ ఇద్దరూ సీమ ద్రోహులేనన్నారు. నల్లగుట్టపల్లిలో జరిగిన రచ్చబండ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ.. ుగాడ్సే ఆనాడు మహాత్మాగాంధీని ఎలా హత్య చేశాడో... నేడు పేదలకు ఉపయోగపడుతున్న మహాత్మాగాంధీ ఉపాధి హామీ పథకాన్ని పేరు మార్చి మహాత్ముడి ఆశయాలను మోదీ తుంచివేశారు. ఆయన కూడా గాడ్సేతో సమానమే’ అని విమర్శించారు.

Updated Date - Feb 07 , 2026 | 05:24 AM