Share News

గాడ్సేకు, మోదీకి పెద్ద తేడా లేదు: షర్మిల

ABN , Publish Date - Feb 06 , 2026 | 03:08 AM

జాతిపిత మహాత్మాగాంధీని హత్య చేసిన గాడ్సేకు, గాంధీ పేరును నాశనం చేయాలని చూస్తున్న ప్రధాని మోదీకి పెద్దతేడా లేదని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల విమర్శించారు.

గాడ్సేకు, మోదీకి పెద్ద తేడా లేదు: షర్మిల

పుంగనూరు, ఫిబ్రవరి 5(ఆంధ్రజ్యోతి): జాతిపిత మహాత్మాగాంధీని హత్య చేసిన గాడ్సేకు, గాంధీ పేరును నాశనం చేయాలని చూస్తున్న ప్రధాని మోదీకి పెద్దతేడా లేదని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల విమర్శించారు. అన్నమయ్య జిల్లా పుంగనూరులో, కలికిరిలో గురువారం జరిగిన ఉపాధి హామీ పథకం పరిరక్షణ యాత్రలో ఆమె మాట్లాడారు. మాజీ సీఎం జగన్‌, ప్రస్తుత సీఎం చంద్రబాబు కలిసి రాష్ర్టాన్ని రూ.11లక్షల కోట్ల అప్పుల కుప్పగా తయారు చేశారని అన్నారు. రాహుల్‌గాంధీని ప్రధానిని చేస్తే పదేళ్లు రాష్ట్రానికి ప్రత్యేక హోదాతోపాటు అధిక నిధులు తెప్పిస్తామని షర్మిల చెప్పారు. మోదీ అమెరికా చేతిలో బానిసగా మారారని, అమెరికా వ్యవసాయ ఉత్పత్తులను భారతదేశం నిండా నింపేందుకు సుంకం మాఫీ చేశారని ఆరోపించారు.

Updated Date - Feb 06 , 2026 | 03:08 AM