ఆ ముగ్గురూ మోదీ తొత్తులు
ABN , Publish Date - Feb 03 , 2026 | 05:56 AM
సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి.. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నారని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మండిపడ్డారు.
‘ఉపాధి’ పథకానికి తూట్లు పొడిచారు
బాబు.. పవన్.. జగన్‌పై షర్మిల ధ్వజం
అనంతలో ఉపాధి పథకం పరిరక్షణ యాత్ర
నార్పల, ఫిబ్రవరి 2(ఆంధ్రజ్యోతి): సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి.. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నారని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మండిపడ్డారు. అనంతపురం జిల్లా నార్పల మండలం బండ్లపల్లి గ్రామంలో సోమవారం మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పరిరక్షణ యాత్రను షర్మిల ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామంలో ఏర్పాటు చేసిన సభలో ఆమె మాట్లాడుతూ, ‘కాంగ్రెస్ హయాంలో దాదాపు 20 ఏళ్ల కిందట బండ్లపల్లి వేదికగా ఉపాధి హామీ పథకాన్ని సోనియాగాంధీ ప్రారంభించారు. ఈ పథకాన్ని మోదీ, చంద్రబాబు, జగన్ కలసి భ్రష్టు పట్టించారు. రాష్ట్రంపై భారం వేసేలా వీబీజీ రామ్‌జీ పథకానికి చంద్రబాబు, జగన్ ఎందుకు మద్దతు ఇచ్చారు? ఉపాధి పథకాన్ని పునరుద్ధరించేలా కేంద్రంపై ఒత్తిడి తేవాలి’ అని డిమాండ్ చేశారు.