YS Sharmila: కూటమికి మహిళా సాధికారతపై చిత్తశుద్ధి ఏదీ?
ABN , Publish Date - Jan 14 , 2026 | 04:40 AM
కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లవుతున్నా మహాశక్తి పథకానికి అతీగతిలేదని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు.
రెండేళ్లయినా అతీగతీ లేని ‘మహాశక్తి’: షర్మిల
కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లవుతున్నా మహాశక్తి పథకానికి అతీగతిలేదని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం ఈమేరకు ఆమె ఓ ప్రకటన చేశారు. ‘పండుగల పేరుతో కాలయాపన తప్ప మహిళా సాధికారతపై సీఎం చంద్రబాబుకు కమిట్మెంట్ లేదు. ఆడబిడ్డ నిధి పేరుతో కోటిన్నర మంది రాష్ట్ర మహిళలకు సీఎం చంద్రబాబు చేసింది ఘరానా మోసమే. నెలకిచ్చే రూ.15,000కు గాను రూ.50,000 ఆదాయం వచ్చే మార్గం చూపుతామన్నారు. సూపర్ సిక్స్ హామీల్లో ఆడబిడ్డ నిధి ప్రధాన హామీ. ఈ పథకాన్ని రెండేళ్లుగా అమలు చేయకుండా సూపర్ సిక్స్, సూపర్‌హిట్ అని చెప్పుకోవడానికి కూటమికి సిగ్గుండాలి. ఇష్టమొచ్చినప్పుడు అమలు చేసేవి ఎన్నికల హామీలు కావు. మహాశక్తి పథకాన్ని తక్షణమే అమలు చేయాలి’ అని షర్మిల డిమాండ్ చేశారు.