YS Sharmila: ఉపాధి హామీపై కేంద్రం కుట్రలు
ABN , Publish Date - Jan 03 , 2026 | 06:27 AM
జాతీయ ఉపాధి హామీ పథకంపై కేంద్రం కుట్రలు చేస్తుంటే సీఎం చంద్రబాబు కిమ్మనకుండా ఉండడం దారుణం. బీజేపీ చేస్తున్న నల్ల చట్టాలకు చప్పట్లు కొట్టడం అత్యంత సిగ్గుచేటు....
సీఎం చంద్రబాబు కిమ్మనకపోవడం దారుణం: వైఎస్ షర్మిల
అమరావతి, జనవరి 2(ఆంధ్రజ్యోతి): ‘జాతీయ ఉపాధి హామీ పథకంపై కేంద్రం కుట్రలు చేస్తుంటే సీఎం చంద్రబాబు కిమ్మనకుండా ఉండడం దారుణం. బీజేపీ చేస్తున్న నల్ల చట్టాలకు చప్పట్లు కొట్టడం అత్యంత సిగ్గుచేటు’ అని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. ఉపాధి హామీ పథకానికి కేంద్రం నిధులు మంజూరు చేయకపోతే కూలీలకు పనులు ఇవ్వడం కష్టమని తెలిసినా చంద్రబాబు మాట్లాకడపోవడం ఏమిటని శుక్రవారం ఒక ప్రకటనలో నిలదీశారు. ఉపాధి హామీపై కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని చంద్రబాబు ప్రశ్నించకపోవడం బాధాకరమన్నారు. ప్రతి నెలా ప్రభుత్వ ఉద్యోగుల జీతాలకే అప్పులు చేసే రాష్ట్ర ప్రభుత్వం జీ రామ్‌జీ పథకానికి 40ు నిధులు ఎలా తెస్తుందని ప్రశ్నించారు. గోరుచుట్టుపై రోకలిపోటులా కొత్త చట్టం మారిందని తెలిసికూడా సీఎం ఏమీ మాట్లాడకపోవడాన్ని ఆమె తప్పుపట్టారు. నిరుద్యోగంలో నంబర వన్‌గా ఉన్న రాష్ట్రంలో ఉపాధికి ఉరి పెడుతుంటే ప్రజలకు ఏం సమాధానం చెపుతారు? అని షర్మిల నిలదీశారు.