Share News

వైసీపీ పాపాలను వైఎస్‌కు అంటగడతారా: షర్మిల

ABN , Publish Date - Feb 25 , 2026 | 04:17 AM

వైసీపీ చేసిన కల్తీ పనులను వైఎస్‌ రాజశేఖరరెడ్డికి అంటగడతారా అని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ప్రశ్నించారు.

వైసీపీ పాపాలను వైఎస్‌కు అంటగడతారా: షర్మిల

అమరావతి, ఫిబ్రవరి 24(ఆంధ్రజ్యోతి): వైసీపీ చేసిన కల్తీ పనులను వైఎస్‌ రాజశేఖరరెడ్డికి అంటగడతారా అని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ప్రశ్నించారు. అత్త మీద కోపం దుత్త మీద చూపినట్లుగా కూటమి తీరు ఉందని మంగళవారం ఒక ప్రకటనలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘తిరుమల పవిత్రతపై వైసీపీ చేసిన పాపాన్ని, మహానేత వైఎస్సార్‌కు అంటగట్టడం చంద్రబాబుకు భావ్యం కాదు. ఆయన ఆరోపణలను అసెంబ్లీ రికార్డుల నుంచి తొలగించాలి. దివంగత నేతకు చంద్రబాబు క్షమాణలు చెప్పాలి. వైఎస్సార్‌ ఏడు కొండలను రెండు కొండలను చేయాలని ఏనాడూ అనుకోలేదు. వైఎస్సార్‌ది సంక్షేమ పాలనైతే .. వైసీపీది దోచుకుతిన్న పాలన. వైసీపీ అరాచకాలతో వైఎస్సార్‌కు సంబంధం లేదు’ అని స్పష్టంచేశారు.

Updated Date - Feb 25 , 2026 | 04:18 AM