Share News

‘బండ’ బాదుడు.. కేంద్రం అతి పెద్ద గిఫ్ట్‌: షర్మిల

ABN , Publish Date - May 03 , 2026 | 05:06 AM

ఓట్ల కోసం వేషం కట్టడం... ఎన్నికలు ముగిశాక జనం నెత్తిన భారం మోపడం ప్రధాన నరేంద్ర మోదీకి వెన్నతో పెట్టిన విద్య అని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల విమర్శించారు.

‘బండ’ బాదుడు.. కేంద్రం అతి పెద్ద గిఫ్ట్‌: షర్మిల

అమరావతి, విశాఖపట్నం, మే 2(ఆంధ్రజ్యోతి): ఓట్ల కోసం వేషం కట్టడం... ఎన్నికలు ముగిశాక జనం నెత్తిన భారం మోపడం ప్రధాన నరేంద్ర మోదీకి వెన్నతో పెట్టిన విద్య అని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల విమర్శించారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల తర్వాత ‘బండ బాదుడు’ దేశ ప్రజలకు కేంద్రం ఇచ్చిన అది పెద్ద గిఫ్ట్‌ అని శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ‘వాణిజ్య గ్యాస్‌ సిలెండర్‌ మీద ఒకేసారి రూ.993, ఐదు కిలోల మినీ సిలెండరుపై రూ.549 పెంచిన ఘనత మోదీకే దక్కింది. ఆరు నెలల్లో రూ.1513 పెంచడం దేశ చరిత్రలోనే ఇది ప్రథమం. ఈ ఏడాదిలోనే ధర 80ు పెంచిన మోదీ ఘనతకు గుర్తుగా దేశంలోని ప్రతి మ్యూజియంలోనూ ప్రధాని పేరును సువర్ణాక్షరాలతో రాయాలి. బయట తినేవారి నెత్తిన గుదిబండ. విద్యార్ధులు, కార్మికుల నడ్డి విరిచినట్లే. టీస్టాల్స్‌, మిని హోటళ్లు లాంటి చిన్న వ్యాపారుల జీవితాలు అగమ్యగోచరం. కేంద్రం తక్షణం స్పందించి పెంచిన ధరలను ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేస్తున్నాం’ అని షర్మిల పేర్కొన్నారు.

Updated Date - May 03 , 2026 | 05:07 AM