Share News

కాంగ్రెస్‌ను బలోపేతం చేద్దాం... రండి

ABN , Publish Date - May 15 , 2026 | 04:43 AM

‘దివంగత సీఎం, కాంగ్రెస్‌ నేత వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి ఆశయాలను అమలు చేసేలా చేయి చేయి కలుపుదాం.

కాంగ్రెస్‌ను బలోపేతం చేద్దాం... రండి

  • వైఎస్‌ అభిమానులకు షర్మిల పిలుపు

అమరావతి, మే 14(ఆంధ్రజ్యోతి): ‘దివంగత సీఎం, కాంగ్రెస్‌ నేత వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి ఆశయాలను అమలు చేసేలా చేయి చేయి కలుపుదాం. కాంగ్రెస్‌ పార్టీని రాష్ట్రంలో బలోపేతం చేద్దాం’ అని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల పిలుపిచ్చారు. ఈమేరకు ఆమె గురువారం ఒక ప్రకటన చేశారు. ‘వైఎస్ఆర్‌ ఐడియాలజీ ఉన్నది, ఆయన వారసత్వం కొనసాగేదీ, ఆయన ఆశయ సాధన జరిగేదీ కాంగ్రెస్‌తోనే. ఆయన ముమ్మాటికీ కాంగ్రెస్‌ మనిషి. ఆయన కడదాకా బ్రతికిన ఆ పార్టీని అధికారంలోకి తెద్దాం. అందుకు చేయి చేయి కలపాలని వైఎస్ఆర్‌ అభిమానులను కోరుకుంటున్నా’ అని షర్మిల పేర్కొన్నారు.

Updated Date - May 15 , 2026 | 04:44 AM