మోదీ ఫిడేల్ చక్రవర్తి: షర్మిల
ABN , Publish Date - May 22 , 2026 | 05:23 AM
‘ప్రధాని మోదీ ఫిడేల్ చక్రవర్తి అని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. ‘రోమ్ నగరం కాలిపోతుంటే నీరో చక్రవర్తి పిడేల్ వాయించినట్లుంది మోదీ తీరు.
అమరావతి, మే 21(ఆంధ్రజ్యోతి): ‘ప్రధాని మోదీ ఫిడేల్ చక్రవర్తి అని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. ‘రోమ్ నగరం కాలిపోతుంటే నీరో చక్రవర్తి పిడేల్ వాయించినట్లుంది మోదీ తీరు. దేశంలో ఆర్థిక తుఫాన్ రాబోతుందంటే ఇటీలీలో మోదీ చాక్లెట్లు పంచడం ఏమిటి? అంతర్జాతీయంగా దారుణ పరిస్థితులు ఏర్పడ్డ సమయంలో మోదీజీ... మెలోడి చాక్లెట్‌లు పంచుకొని తింటారా? మతఘర్షణలు, పేపర్ లీకులతో విద్యార్థులకు వెన్నుపోట్లు. ప్రజలపై ధరా భారం పెరిగింది’ అని విమర్శించారు.