Share News

విజయ్‌, బీజేపీకి శుభాకాంక్షలు: జగన్‌

ABN , Publish Date - May 05 , 2026 | 04:30 AM

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై వైసీపీ అధ్యక్షుడు జగన్‌ సోమవారం ‘ఎక్స్‌’లో పోస్టు చేశారు. తొలిసారి ఎన్నికల రంగంలోకి దిగి...

విజయ్‌, బీజేపీకి శుభాకాంక్షలు: జగన్‌

అమరావతి, మే 4(ఆంధ్రజ్యోతి): ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై వైసీపీ అధ్యక్షుడు జగన్‌ సోమవారం ‘ఎక్స్‌’లో పోస్టు చేశారు. తొలిసారి ఎన్నికల రంగంలోకి దిగి, తమిళనాడులో అతిపెద్ద పార్టీగా నిలిచిన టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్‌కు అభినందనలు తెలిపారు. పశ్చిమబెంగాల్‌లో ఓటమిపాలైన టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీకి సానుభూతి తెలిపిన ఆయన.. పశ్చిమబెంగాల్‌ సహా అస్సాం, పుదుచ్చేరిలో విజయం సాధించిన బీజేపీకి శుభాకాంక్షలు తెలిపారు.

Updated Date - May 05 , 2026 | 04:31 AM