మరో మూడేళ్లలో అధికారంలోకి వచ్చేస్తున్నాం: జగన్
ABN , Publish Date - Mar 18 , 2026 | 04:55 AM
తప్పు చేసినవారి చెంపను చంద్రబాబు చెల్లుమనిపిస్తే కూటమి ప్రభుత్వంలో తప్పులు కొనసాగేవా అని వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ప్రశ్నించారు.
అమరావతి, మార్చి 17(ఆంధ్రజ్యోతి): తప్పు చేసినవారి చెంపను చంద్రబాబు చెల్లుమనిపిస్తే కూటమి ప్రభుత్వంలో తప్పులు కొనసాగేవా అని వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ప్రశ్నించారు. మంగళవారం తాడేపల్లి ప్యాలె్‌సలో ఆయన ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గ వైసీపీ నేతల తో సమావేశమయ్యారు. కళ్లు మూస్తే రెండేళ్లు గడచిపోయాయని.. మరో మూడేళ్లలో వైసీపీ అధికారంలోకి వచ్చేస్తోందన్నారు. రెండేళ్లలో తన పాదయాత్ర కూడా పూర్తవుతుందన్నారు. ఒంగోలు అసెంబ్లీ ఇన్‌చార్జిగా చుండూరి రవిబాబును జగన్ ప్రకటించారు.