జగన్ అవతార పురుషుడు 2029లో రప్పా రప్పా
ABN , Publish Date - Mar 06 , 2026 | 05:05 AM
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి కడప జిల్లా ప్రొద్దుటూరు పర్యటనలో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు హల్‌చల్ చేశారు.
ప్రొద్దుటూరు పర్యటనలో ప్లకార్డులతో వైసీపీ కార్యకర్తల హల్‌చల్
ప్రొద్దుటూరు, మార్చి 5 (ఆంధ్రజ్యోతి): వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి కడప జిల్లా ప్రొద్దుటూరు పర్యటనలో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు హల్‌చల్ చేశారు. కొందరు కార్యకర్తలు ‘2029లో రప్పా రప్పా’, ‘కర్మ ఫలితానుసారం అవతరించిన అవతార పురుషుడు జగన్’ అంటూ ప్లకార్డులతో నినాదాలు చేస్తూ ఊగిపోయారు. గురువారం మధ్యాహ్నం వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి కుమార్తె వివా హ రిసెప్షన్‌కు జగన్ హజరయ్యారు. హెలీప్యాడ్ నుంచి రాచమల్లు సొంత ఎస్టేట్‌లో ఏర్పాటు చేసిన వివాహ రిసెప్షన్‌కు దాదాపు 500 మీటర్ల మేర జగన్ కాన్వాయ్ జనం తోపులాటల మధ్య హంగామాగా సాగింది.