ఆ లాగిన్ ఈగల్ ఐజీ ఐడీది కాదు
ABN , Publish Date - Apr 08 , 2026 | 04:36 AM
పోలీసు శాఖ నిర్వహించిన డ్రగ్స్ అవగాహన కార్యక్రమంలో కనిపించిన వై.ఎస్. జగన్‌మోహన్ జూమ్ ఐడీ ఈగల్ ఐజీ ఆకే రవికృష్ణ ఐడీది కాదని తిరుపతి ఎస్పీ సుబ్బరాయుడు...
తిరుపతి ఎస్పీ సుబ్బరాయుడు వివరణ
తిరుపతి(నేరవిభాగం),ఏప్రిల్ 7(ఆంధ్రజ్యోతి): పోలీసు శాఖ నిర్వహించిన డ్రగ్స్ అవగాహన కార్యక్రమంలో కనిపించిన వై.ఎస్. జగన్‌మోహన్ జూమ్ ఐడీ ఈగల్ ఐజీ ఆకే రవికృష్ణ ఐడీది కాదని తిరుపతి ఎస్పీ సుబ్బరాయుడు ఓ ప్రకటనలో తెలిపారు. విద్యార్థులకు డ్రగ్స్‌పై అవగాహన కల్పించేందుకు తిరుపతి సందేశ్ 2.0 పేరుతో కార్యక్రమాన్ని సోమవారం ఎస్వీ యూనివర్శిటీలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సుమారు లక్షమంది విద్యార్థులు జూమ్ లింక్ ద్వారా వర్చువల్‌గా పాల్గొన్నారు. సమావేశం సజావుగా జరిపించేందుకు అందరినీ మ్యూట్‌లో ఉంచినట్టు ఎస్పీ తెలిపారు. పాల్గొన్నవారు స్వయంగా అన్‌మ్యూట్ చేసుకునే ఆప్షన్‌ను కూడా నియంత్రించారు. అయితే ఐజీ ఆకే రవికృష్ణ వర్చువల్‌గా పాల్గొన్న సమయంలో అన్‌మ్యూట్ ఆప్షన్‌ను ఎనేబుల్ చేశారు. ఈ సమయంలో వై.ఎ్‌స.జగన్‌మోహన్ పేరుతో ఉన్న వ్యక్తి లాగిన్ కావడంతో ఆ పేరు స్ర్కీన్‌పై కనిపించిందని ఎస్పీ వివరించారు.