చనిపోయాక ప్రతి ఇంట్లో నా ఫొటో ఉండాలన్నదే కోరిక
ABN , Publish Date - Jun 19 , 2026 | 04:53 AM
‘నేను చనిపోయాక ప్రతి ఇంట్లో నా ఫొటో ఉండాలన్నదే నా తాపత్రయం’ అని వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో..
ఈ రెండేళ్లూ పార్టీ కోసం కష్టపడండి.. జగన్ 2.0లో మీకు ప్రాధాన్యమిస్తా
రంపచోడవరం నియోజకవర్గ కార్యకర్తలతో జగన్
అమరావతి, జూన్ 18(ఆంధ్రజ్యోతి): ‘నేను చనిపోయాక ప్రతి ఇంట్లో నా ఫొటో ఉండాలన్నదే నా తాపత్రయం’ అని వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం రంపచోడవరం నియోజకవర్గ వైసీపీ నాయకులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ కళ్లు మూసి తెరిచేలోగా రెండేళ్లయిపోయాయని, మరో రెండేళ్లు కళ్లుమూసుకుంటే వైసీపీ ప్రభుత్వం వచ్చేస్తుందన్నారు. నియోజకవర్గంలోని నాయకులు, కార్యకర్తలు ఈ రెండేళ్లూ పార్టీ కోసం కష్టపడాలని, అధికారంలోకి వచ్చాక కార్యకర్తలకు ప్రాధాన్యం ఇస్తానన్నారు. జగన్ 2.0లో కార్యకర్తలకు పూర్తి స్వేచ్ఛ ఉంటుందన్నారు.