స్టాలిన్, విజయ్‌లతో జగన్
ABN , Publish Date - Feb 09 , 2026 | 04:38 AM
వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, తమిళగ వెట్రి కళగం(టీవీకే) పార్టీ అధినేత విజయ్‌లను వేర్వేరుగా కలుసుకున్నారు.
చెన్నై, ఫిబ్రవరి 8(ఆంధ్రజ్యోతి): వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, తమిళగ వెట్రి కళగం(టీవీకే) పార్టీ అధినేత విజయ్‌లను వేర్వేరుగా కలుసుకున్నారు. ఆదివారం చెన్నైలో తన సమీప బంధువు వైఎస్ సునీల్‌రెడ్డి కుమారుడు సాహిల్, మురుగప్పా గ్రూపు సంస్థల అధినేత అరుణాచలం మురుగప్పన్ కుమార్తె వేదిక మెయ్యమ్మైల వివాహానికి జగన్ హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి హాజరైన స్టాలిన్, విజయ్‌లతో జగన్ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. జగన్ వెంట ఆయన సతీమణి భారతి, రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి, వైసీపీ నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డి తదితరులున్నారు. ఇదే కార్యక్రమానికి హాజరైన సినీనటులు సూర్య, కార్తీ కూడా జగన్‌ను పలకరించారు.