Share News

హత్యలు చేయించడంలో జగన్‌ ఆరితేరారు

ABN , Publish Date - Apr 20 , 2026 | 03:37 AM

‘హత్యలు చేయించడంలో జగన్‌ ఆరితేరారు. ప్రజా సమస్యలు వెలుగులోకి తీసుకొస్తున్న ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణకు ఆయన నుంచి ప్రమాదం పొంచి ఉంది.

హత్యలు చేయించడంలో జగన్‌ ఆరితేరారు

  • రాధాకృష్ణకు ప్రమాదం పొంచి ఉంది: బుచ్చయ్య చౌదరి

రాజమహేంద్రవరం, ఏప్రిల్‌ 19 (ఆంధ్రజ్యోతి): ‘హత్యలు చేయించడంలో జగన్‌ ఆరితేరారు. ప్రజా సమస్యలు వెలుగులోకి తీసుకొస్తున్న ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణకు ఆయన నుంచి ప్రమాదం పొంచి ఉంది. ఆయనపై దాడి చేయించే అవకాశముంది. రాధాకృష్ణ జాగ్రత్తగా ఉండాలి. వైసీపీ కార్యకర్తలు నరుకుతామంటున్నారు. వైసీపీ నాయకులు విషనాగుల్లాంటి వాళ్లు’ అని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, రాజమహేంద్రవరం రూరల్‌ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. మూడోసారి పొలిట్‌బ్యూరో సభ్యుడిగా నియమితులైన సందర్భంగా ఆదివారం మీడియాతో మాట్లాడారు. సీఎం చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు. జగన్‌ అధికారంలో ఉన్నప్పుడు తప్పుడు కేసులు పెట్టి చంద్రబాబును 53 రోజులు జైల్లో పెట్టించారన్నారు. వైసీపీని ప్రజలు మళ్లీ అధికారంలోకి రానివ్వరన్నారు.

Updated Date - Apr 20 , 2026 | 03:38 AM